విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ టాలీవుడ్ లో రిలీజవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను రీసెంట్ గా కిల్లర్ మూవీ తో పలుకరించిన హీరో విజయ్ ఆంటోనీ, కిల్లర్ తమిళ వెర్షన్ రూపొందిందించిన ప్రొడక్షన్ టీమ్ కు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలిం ప్రొడక్షన్ టీమ్ ప్రదీప్ కుమార్, కమల్ బోహ్రా, ధనుంజయన్ (డిస్ట్రిబ్యూటర్ )
ఆధ్వర్యం లో సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా అవుట్ &అవుట్ యాక్షన్ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూర్తి గా అవుట్ డోర్ లో రూపొందే ఈ మూవీ డయ్యు డామన్ లోని ముఖ్య ప్రదేశాలలో, గోవా లో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకోనుంది. ధనుంజయన్ మాట్లాడుతూ … అక్టోబర్ 1 వ తేదీ షూటింగ్ ప్రారంభం కానుందని, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కు ప్లాన్ చేశామని, బల్క్ గా డేట్స్ ఇచ్చే ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేస్తామని తెలిపారు. ఒక యంగ్ హీరో కూడా ఈ మూవీ లో నటిస్తారని, ఇద్దరి హీరోల మూవీ కాదని, విజయ్ ఆంటోనీ సోలో హీరో అని, విజయ్ ఆంటోనీ తో మూడు సినిమాలు ప్లాన్ చేశామని చెప్పారు.
[youtube_video videoid=fquEMqAXh6E]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: