నిజానికి ఒక సినిమా చూడాలంటే ఎంత ఈజీనో.. సినిమా తీయాలంటే మాత్రం చాలా కష్టం. సినిమా మొదలైన దగ్గర నుండి రిలీజ్ అయ్యేంతవరకూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఫిలిం మేకర్స్ కు. లొకేషన్స్ విషయంలో కానీ.. వాటి పర్మిషన్స్ విషయంలో కానీ.. పబ్లిక్ సేఫ్టీ విషయంలో కానీ.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఫిలిం మేకర్స్ కాస్త ఊరట కలిగించే విధంగా చర్యలు తీసుకుంటుంది ‘నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్’. ఇకపై ఫిలిం మేకర్స్ ఎలాంటి అనుమతులు కావాలన్నా ఈజీగా పొందే విధంగా ‘ఫిలిం ఫెసిలియేషన్ ఆఫీస్’ లను అందుబాటులో ఉంచనుంది. ఈనేపథ్యంలోనే www.ffo.gov.in అనే వెబ్ సైట్ ను కూడా అందుబాటులో ఉంచుతుంది. ఈ సైట్ ద్వారా ఎలాంటి అనుమతులు కావాలన్నా సకాలంలో పొందవచ్చు. కేవలం మన వాళ్లకే కాదు.. ఫారినర్స్ కు కూడా ఈ అవకాశం వెసలుబాటులో ఉందని తెలియజేస్తుంది ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్. మరింత సమాచారం కావాలంటే కింద ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఇచ్చిన క్లియరెన్స్ పత్రం ఇవ్వబడింది.. దానిని చదివి మరింత సమాచారం తెలుసుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=6ewX0WEqmkk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























