జూన్ రెండో వారం నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చ‌ర‌ణ్‌!?

Ram Charan to Join RRR Shooting in June 2nd Week,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie New,Ram Charan to Join RRR Movie Shoot,RRR Movie Shooting Latest Updates,RRR Team Plans New Shooting Schedule For Next Week,Ram Charan Begins RRR Shoot From Next Week
Samantha Oh Baby to be Remade in Hindi

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ సమయంలో చీలమండ గాయం కారణంగా రామ్ చరణ్ షూటింగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అహ్మ‌దాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో గాయపడిన చరణ్… ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికా టూర్‌ను ముగించుకుని వ‌చ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేప‌థ్యంలో… దాదాపు నెల రోజుల విరామం అనంతరం… జూన్ రెండో వారం నుంచి ఆర్ ఆర్ ఆర్‌ షూటింగ్‌లో చ‌ర‌ణ్ పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం.

కాగా… ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రాత్రివేళల్లో కీలకమైన పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో యన్టీఆర్‌తో కలిసి తెరను పంచుకుంటున్నాడు చరణ్. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ చిత్రం… వచ్చే సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

[youtube_video videoid=_myq-46Lp_c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.