మహేష్ సినిమాలో రీ ఎంట్రీ పై రాములమ్మ

Vijayashanthi About Her Re entry With Sarileru Neekevvaru,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Vijayashanthi Re entry in Tollywood Films,Vijayashanthi About Mahesh Babu New Movie Sarileru Neekevvaru,Lady Superstar Vijayashanthi is Back With Mahesh Babu New Movie,Vijayashanthi Joins Sarileru Neekevvaru Movie Team
Vijayashanthi About Her Re entry With Sarileru Neekevvaru

లేడి సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి విజయశాంతి. 1980 లో కిలాడి క్రిృష్ణుడు సినిమాతో.. సూపర్ స్టార్ హీరో కృష్ణ కు జోడిగా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన విజయశాంతి ఆ సినిమా విజయంతో ఆ తరువాత వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల పక్కన చేస్తూనే.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల పక్కన కూడా పలు హిట్ సినిమాలు తీసి దాదాపు రెండు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది. అంతేకాదు ప్రతిఘటన, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ అనే లేడి ఒరియెంటెడ్ సినిమాలతో అందరి హీరోయిన్ల కంటే తాను భిన్నమని నిరూపించుకుంది. అందుకే లేడి సూపర్ స్టార్ అనే బిరుదు వరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చివరిగా 2006 లో వచ్చిన నాయుడమ్మ మూవీలో కనిపించిన విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయ్యారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు రాములమ్మ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈరోజే ఈసినిమాను లాంచనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో విజయశాంతి కూడా నటిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే విజయశాంతి తన ట్విట్టర్ ద్వారా భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… సూపర్ స్టార్ కృష్ణ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన విజయశాంతి… ఇప్పుడు యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ సినిమా విజయశాంతి రీఎంట్రీకి కలిసొస్తుందో? లేదో? చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=zbUaqedhYMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 16 =