`స‌రిలేరు నీకెవ్వ‌రు`తోనూ… `దిల్‌` రాజు సెంటిమెంట్ రిపీట్ అవుద్దా?

Same Sentiment To Continue For Dil Raju For Sarileru Neekevvaru Movie Also,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Dil Raju Repeat The Same Sentiment For Sarileru Neekevvaru Movie,Dil Raju Next Film Updates,Dil Raju About Sarileru Neekevvaru,Dil Raju Sentiment in Sarileru Neekevvaru Movie
Same Sentiment To Continue For Dil Raju For Sarileru Neekevvaru Movie Also

దిల్‌ రాజు… విజయవంతమైన చిత్రాలను చిరునామాగా నిల‌చిన ఈత‌రం నిర్మాత. తొలి చిత్రం ‘దిల్’ నుంచి తాజా చిత్రం ‘మహర్షి’ వరకు ఆయ‌న‌ది ఇదే బాణీ. ప్రస్తుతం… దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌తో ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక‌టి. అనిల్ సుంకర, మహేష్ బాబుతో కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు రాజు. శుక్ర‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా మొద‌లైన ఈ సినిమా… త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నుంది. అంతేకాదు… 2020 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించేశారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ‘దిల్’ రాజుకి, సంక్రాంతి సీజ‌న్‌కి మంచి అనుబంధమే ఉంది. గ‌తంలో ఆయ‌న నిర్మించిన నాలుగు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాలను నమోదు చేసాయి.

ఆ వివరాల్లోకి వెళితే… 2013 జనవరి 11న విడుదలైన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, 2014 జనవరి 12న రిలీజైన ఎవ‌డు ‘దిల్’ రాజుకి వ‌రుస‌గా రెండు సంక్రాంతి విజయాలను అందించాయి. అలాగే… భారీ సినిమాల మధ్య సంక్రాంతి సందర్భంగా 2017 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ‌తమానంభ‌వ‌తి ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 12న విడుదలైన ‘ఎఫ్ 2’ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది. ఇప్పుడు ఈ వ‌రుస‌లోనే… మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా సంక్రాంతికి విడుద‌ల కానుండ‌డంతో సర్వత్రా ఆస‌క్తి నెలకొంది. ఇప్ప‌టికే సంక్రాంతి సీజ‌న్‌లో నాలుగు విజ‌యాల‌ను అందుకున్న రాజు.. ‘సరిలేరు నీకెవ్వరు’తోనూ ఆ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=zbUaqedhYMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =