కలిసొచ్చిన జంటలతో ఒకే రోజున‌ రానున్న‌ విజయ్ దేవ‌ర‌కొండ‌, కంగనా ర‌నౌత్‌

Kangana Ranaut Next Project Details,Interesting Coincidence Between Vijay Deverakonda and Kangana Ranaut,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Kangana Ranaut and Vijay Deverakonda Have an Interesting Coincidence,Vijay Deverakonda and Kangana Ranaut Movie Releasing on Same Day
Interesting Coincidence Between Vijay Deverakonda and Kangana Ranaut

వైవిధ్యభరితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అన‌తికాలంలోనే స్టార్‌డ‌మ్ పొందిన విజ‌య్‌… ఏ ఏడాదికేడాది త‌న స్థాయిని పెంచుకుంటూ తారాప‌థంలో దూసుకుపోతున్నాడు. గత సంవ‌త్స‌రం ‘మహానటి’, ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన సినిమాలతో పలకరించిన విజయ్… ఇప్పడు ‘డియర్ కామ్రేడ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కట్ చేస్తే… ఇదే రోజున అంటే జూలై 26న బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ నటించిన బ్లాక్ కామెడీ మూవీ ‘మెంటల్ హై క్యా?’ కూడా రిలీజ్ కానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.

ఇదిలా ఉంటే… ఒకే రోజున‌ రానున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశముంది. అదేమిటంటే… ఇటు విజ‌య్‌, అటు కంగ‌నా ఇద్ద‌రు కూడా త‌మ‌కు క‌లిసొచ్చిన జంట‌ల‌తోనే ఆ రోజు సంద‌డి చేయ‌బోతున్నారు. డియ‌ర్ కామ్రేడ్ విష‌యానికి వ‌స్తే… ‘గీతగోవిందం’ వంటి కెరీర్ బెస్ట్ హిట్‌ తర్వాత రష్మిక మందన్న కాంబినేష‌న్‌లో విజ‌య్ న‌టించిన సినిమా ఇది. దీంతో… ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇక మెంట‌ల్ హై క్యా? విష‌యానికి వ‌స్తే… త‌న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘క్వీన్’ తర్వాత రాజ్ కుమార్ రావ్‌తో కంగనా నటించిన మూవీ ఇది. దీంతో… స‌హ‌జంగానే ఈ సినిమా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

సో… విజయ్, కంగనా ఇద్దరూ కూడా తమ తమ కెరీర్ బెస్ట్ మూవీస్‌గా నిలిచిన చిత్రాల్లో పెయిర్స్‌గా నటించిన వారితోనే… ఈ అప్ కమింగ్ మూవీస్‌లోనూ దర్శనమివ్వడం విశేష‌మనే చెప్పాలి.మ‌రి… తమకు కలిసొచ్చిన జంటలతో ఒకే రోజున‌ వస్తున్న విజయ్, కంగనా ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=VagrwsPi3as]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 16 =