‘ఆర్ ఆర్ ఆర్’లో సాయిప‌ల్ల‌వి?

Sai Pallavi Roped In For Prestigious RRR Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sai Pallavi To Join RRR Movie Team,Sai Pallavi Next in Rajamouli RRR Movie,RRR Movie Latest Updates,Sai Pallavi New Movie Updates,Sai Pallavi To Work With RRR Team
Sai Pallavi Roped In For Prestigious RRR Movie?

సాయిపల్లవి… వైవిధ్యభరితమైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తూ న‌టిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌. నాలుగేళ్ళ క్రితం విడుద‌లైన మల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘ప్రేమమ్’తో వెండితెరకు క‌థానాయిక‌గా పరిచయమైన సాయిప‌ల్ల‌వి … ఆపై ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగులోనూ తొలి అడుగులోనే విజయం సాధించింది. అనంతరం ‘ఎం.సి.ఎ’, ‘క‌ణం’, ‘ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ చిత్రాల‌తో న‌టిగా మ‌రింత‌ గుర్తింపు తెచ్చుకుంది ఈ డ్యాన్సింగ్ సెన్సేష‌న్‌. ఇదిలా ఉంటే… ఈ టాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసమని సాయిపల్లవిని సంప్రదించిందట‌ చిత్ర బృందం. అంతేకాదు ఆమె బల్క్ డేట్స్ కోసం కూడా చర్చలు జరుపుతున్నారట. మరి ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేయ‌నున్నారా? లేక మ‌రేమైనా కీలకపాత్ర కోసం సంప్ర‌దించారా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఏది ఏమైనా సాయిపల్లవి డేట్స్ అడ్జ‌స్ట్‌ చేయగలిగితే… మరో టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌ రాజమౌళి టీమ్‌లో జాయిన్ అయినట్టే. త్వ‌ర‌లోనే సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవ‌కాశం ఉంది.

డి.వి.వి.దానయ్య ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌… 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + two =