రాజ‌మౌళి సెన్సేష‌నల్ సెంటిమెంట్‌… `ఆర్ ఆర్ ఆర్‌` తార‌క్‌, చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ అవుతుందా?

SS Rajamouli Sensational Sentiment,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajamouli About RRR Movie,Rajamouli Sentiment Works For RRR Movie,RRR Movie Latest Updates,Rajamouli Get a Hat Trick Movie With Ram Charan and jr NTR,RRR Movie Turns Best Carrier For Ram Charan and jr NTR
SS Rajamouli Sensational Sentiment

ఎస్.ఎస్.రాజమౌళి… తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన ద‌ర్శ‌కుడు. ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన‌ ప్రతీ సినిమా ఓ సంచలనమే. ప్రస్తుతం… యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ని తెరకెక్కిస్తున్నాడీ ద‌ర్శ‌క‌ధీరుడు. ప్ర‌స్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని… 2020 జూలై 30న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించేసాడు ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తావించద‌గ్గ విష‌య‌మేమిటంటే… రాజమౌళికి, జూలై నెల‌కి ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌నే చెప్పాలి. రాజమౌళి ట్రాక్ రికార్డుని ప‌రిశీలిస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టిదాకా రాజ‌మౌళి 11 సినిమాలకు దర్శకత్వం వహించగా… వాటిలో 5 చిత్రాలు జూలై నెలలో విడుదల కావడం ఇందుకు నిద‌ర్శ‌నం. అంతేకాదు… ఈ నెల‌లో త‌ను ఘ‌న విజ‌యాల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా… త‌న సినిమాల్లో న‌టించే హీరోల‌కి కూడా కెరీర్ బెస్ట్‌ను అందిస్తూ వ‌స్తున్నాడు జ‌క్క‌న్న‌.

ఆ వివరాల్లోకి వెళితే… 2003 జూలై 9న విడుద‌లైన ‘సింహాద్రి’తో య‌న్టీఆర్ అప్ప‌ట్లో కెరీర్ బెస్ట్ ని అందుకోగా… 2009 జూలై 31న విడుద‌లైన ‘మగధీర’తో చరణ్ అప్పట్లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌ను అందుకున్నాడు. ఇక 2010 జూలై 23న విడుద‌లైన ‘మర్యాదరామన్న’తో సునీల్, 2012 జూలై 6న విడుద‌లైన‌‘ఈగ‌’తో నాని, 2015 జూలై 10న విడుద‌లైన‌ ‘బాహుబ‌లి – ది బిగినింగ్‌’తో ప్రభాస్ అప్ప‌ట్లో కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ న‌మోదు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో… రాజ‌మౌళి నెక్ట్స్‌ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్‌ కూడా జూలై నెల‌నే టార్గెట్ చేసుకోవ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇప్ప‌టికే జూలై సెంటిమెంట్‌తో విడుద‌లైన ‘సింహాద్రి’, ‘మగధీర’తో తారక్, చరణ్‌కు విడివిడిగా కెరీర్ బెస్ట్ మూవీస్‌ని అందించిన రాజమౌళి… ‘ఆర్ ఆర్ ఆర్’తో ఇద్ద‌రికీ కెరీర్ బెస్ట్‌ని అందిస్తాడేమో చూడాలి. అలాగే… జూలై మంత్‌ రిలీజెస్ ప‌రంగా త‌ను కూడా డ‌బుల్ హ్యాట్రిక్ పూర్తిచేస్తాడా? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

[subscribe]

[youtube_video videoid=0XwacVaiMO0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =