మ‌రో మెగా హీరోతో `తొలిప్రేమ‌` ద‌ర్శ‌కుడు?

Tholi Prema Director To Work With Another Mega Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tholi Prema Director Next With Allu Sirish,Allu Sirish Next Film Updates,Allu Sirish and Director Karunakaran To Team Up For Next,Allu Sirish New Movie News,Allu Sirish Next With Tholi Prema Director
Tholi Prema Director To Work With Another Mega Hero

ఎ.కరుణాకరన్… ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా… మెగాహీరోల‌కు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌లిసొచ్చాడనే చెప్పాలి. ప‌వ‌ర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ని కీల‌క‌ మ‌లుపు తిప్పిన‌ ‘తొలిప్రేమ’… ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ తొలి చిత్రం కావ‌డం విశేషం. ఆ త‌రువాత ప‌వ‌న్‌తోనే బాలుని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘హ్యాపీ’ని రూపొందించి మ్యూజిక‌ల్ హిట్స్ అందుకున్నాడు క‌రుణాక‌ర‌న్‌. అలాగే పుష్కరకాలం గ్యాప్ త‌రువాత‌… అదే మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్‌తో ‘తేజ్ ఐ ల‌వ్ యూ’(2018) చిత్రాన్ని రూపొందించాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. అంతేకాదు… ఇప్పుడు మరో మెగా హీరో కోసం మ‌ళ్ళీ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడ‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… అల్లు శిరీష్ కథానాయకుడిగా కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రానుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఇప్పటికే క‌రుణాక‌ర‌న్‌ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని శిరీష్‌కి వినిపించడం జరిగిందట. శిరీష్‌కి కూడా కథ నచ్చడంతో ఓకే చేసినట్టు తెలుస్తోంది. శిరీష్ హోమ్‌ బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… అల్లు అర్జున్‌తో క‌రుణాక‌ర‌న్ రూపొందించిన హ్యాపీని గీతా ఆర్ట్స్ నిర్మించ‌గా, ఇప్పుడు బ‌న్నీ త‌మ్ముడు అల్లు శిరీష్‌తో చేయ‌బోయే సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించ‌నుండ‌డం విశేషం.త్వ‌ర‌లోనే శిరీష్‌, క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=_h7HAOUNzoQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =