చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా ‘మల్లేశం’ అనే టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో కమెడియన్ ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్ పై రాజ్. ఆర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మాణ సారధ్యం లో రూపొందుతున్న మల్లేశం మూవీకి మార్క్ K రాబిన్ సంగీతం అందిస్తున్నారు. గోరటి వెంకన్న, చంద్రబోస్ గీత రచయితలు.
చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం చేనేత కార్మికుల కష్టాలు తీర్చడానికి దాదాపు ఏడేళ్లు కష్టపడి ఆసు యంత్రాన్ని కనుగొన్నాడు. మామూలుగా ఆసు పోయడంతో ఒక చీర నేయడానికి 5నుంచి 6గంటలు పడుతుంది. అదే ఆసు యంత్రంతో గంటన్నరలో ఒక చీర నేయవచ్చు. అందుకు గాను.. మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు… అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
[subscribe]
[youtube_video videoid=yO82ZbCP7WI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: