చెన్నైలో మహర్షి సరికొత్త రికార్డ్

Maharshi Creates New Record In Chennai,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Sets Another Record,Mahesh Babu Maharshi Movie Latest Updates,Maharshi Movie Collections in Chennai,Maharshi Movie Gets Huge Collections in Chennai
Maharshi Creates New Record In Chennai

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినోదం.. సందేశాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. మహేష్ కెరీర్ లోనే అత్యంత గ్రాస్ కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

చెన్నైలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. 18 రోజుల్లో చెన్నైలో మహర్షి కోటికి పైగా కలెక్షన్స్ ను రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలను అందించింది. ఇది కూడా మహేష్ కెరీర్ లో ఓ రికార్డే.

కాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు – సి.అశ్విని దత్ – పివిపి సంయుక్తంగా నిర్మించారు.

మహర్షి తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈసారి పూర్తి ఎంటర్ టైన్మెంట్ జోనర్ లో సినిమా చేయదలచి అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. మరి చూద్దాం ఎఫ్ 2 తో సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి మహేష్ ను ఎలా చూపిస్తాడో..

[subscribe]
[youtube_video videoid=B9_AnB9WRZw ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − four =