సీజ‌న్‌కో స్టార్ హీరోతో రానున్న నయ‌నతార‌

Nayanthara – The Festival Queen,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Nayanthara New Movie News,Actress Nayanthara Coming Up With Star Heroes,Nayanthara Next Film Updates,Nayanthara is Festival Queen of Industry
Nayanthara - The Festival Queen

నయనతార… గ్లామర్ రోల్స్‌తో పాటు యాక్టింగ్‌ స్కోప్ ఉన్న పాత్రలతోనూ ద‌క్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక. ఓ వైపు ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూనే… మరోవైపు స్టార్ హీరోలతోనూ జట్టు కడుతోంది ఈ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు… స్టార్ హీరోల సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రాలన్నీ… మూడు వేర్వేరు పండుగ‌ల స‌మ‌యంలో విడుద‌ల కానుండ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవికి జోడీగా న‌య‌న‌తార న‌టిస్తున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. చిరు, న‌య‌న్ తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామా… విజ‌య‌ద‌శ‌మి కానుకగా అక్టోబ‌ర్ నెల‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కోలీవుడ్ స్టార్‌ విజయ్ కి జోడీగా నయన్ న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా… దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్‌కి జంట‌గా న‌య‌న్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘దర్బార్’ 2020 సంక్రాంతికి ధియేటర్‌లలోకి రానుంది. అంటే… చిరు, ర‌జినీ, విజ‌య్‌… ఇలా ద‌క్షిణాదికి చెందిన ముగ్గురు స్టార్ హీరోల‌తో న‌య‌న్ న‌టిస్తున్న మూడు వేర్వేరు జాన‌ర్ మూవీస్‌… వేర్వేరు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో రిలీజ్ కానున్నాయ‌న్న‌మాట‌.మ‌రి… ఈ మూడు భారీ చిత్రాలు న‌య‌న‌తార‌కు ఏ స్థాయి విజ‌యాల‌ను అందిస్తాయో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=SkpFcsdCMtc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − two =