2019 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు టాలీవుడ్ కు అత్యంత నిరాశాజనకమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ మూడు నెలల్లో దాదాపు 40కి పైగా సినిమాలు విడుదలైనప్పటికీ “F 2” ఒక్కటే థoడరింగ్ హిట్ గా నిలిచింది.118 ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ రెండు తప్ప స్ట్రైట్ సినిమాల్లో స్టడీ హిట్ గా నిలిచిన చిత్రాలే లేవు.ఇలాంటి నిరాశాజనకమైన ఫలితాలు వస్తున్న తరుణంలో ఏప్రిల్ మాసం విజయాలతో కళకళలాడటం టాలీవుడ్ కు శుభసూచకంగా చెప్పుకోవాలి. ఏప్రిల్ 5న విడుదలైన మజిలీ, 12న విడుదలైన చిత్రలహరి, 19 న విడుదలైన జెర్సీ, మే 9న విడుదలైన మహర్షి చిత్రాలు చక్కనిఫలితాలను సాధించటం ఆనందదాయకం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ నాలుగు చిత్రాలలో స్క్రిప్ట్ పరంగా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఈ నాలుగు చిత్రాల స్క్రిప్ట్ లలో ‘S’ అన్నది కామన్. ఎలాగంటే “మజిలీ” చిత్ర కథ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది…so ‘S’ stands for sports. “చిత్రలహరి” స్క్రిప్ట్ సక్సెస్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.so here ‘S’ stands for Success.మరలా “జెర్సీ” కథ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుంది. ఆ తరువాత వచ్చిన “మహర్షి” కథ సక్సెస్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఈ విధంగా ఈ నాలుగు చిత్రాల స్క్రిప్ట్ లలో ‘S’ కామన్ అయింది. అలాగే ఈ నాలుగు సినిమాలలో కథాపరంగా విపరీతమైన మలుపులు, ట్విస్టులు కనిపించవు. నాలుగు కూడా ఎమోషనల్ జర్నీ లాగానే సాగిపోయాయి.
ఈ నాలుగు చిత్రాలలోని నలుగురు హీరోల పాత్రల్లో అండర్ కరెంట్ గా చిన్న అపరాధభావం కనిపిస్తుంది. చేసిన తప్పులను, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ నలుగురిలోనూ కనిపిస్తుంది.ఇలాంటి కామన్ క్వాలిటీస్ తో రూపొంది విజయాలను సాధించిన ఈ నాలుగు స్క్రిప్ట్ లలో మీకు”The Best” అనిపించిన స్క్రిప్టు ఒకటి ఉంటుంది. అది ఏది? ఇదే ఇవ్వాళ్టి “పోల్ గేమ్”. మరొక విశేషం ఏమిటి అంటే… ఈ నాలుగు సినిమాలు హాట్ సమ్మర్ లో వచ్చి కూల్ హిట్ అయ్యాయి. అందుకే S లో వచ్చి S తో S సాధించిన ఈ నాలుగు హిట్స్ లో స్క్రిప్ట్ పరంగా మీకు నచ్చినది ఏదో క్లిక్ చేయండి.
గమనిక: ఇది స్క్రిప్ట్ లో ఉన్న కామన్ నేచర్ మీద కండక్ట్ చేస్తున్న పోల్ గేమ్. ఇందులో హీరోల పర్సనల్ ఇమేజ్ కి సంబంధించిన ఇష్యూ ఏమీ లేదు.
So… poll and choose the Best script .
[totalpoll id=”21815″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: