ఏఎన్నార్ ‘ముద్దుల కొడుకు’కు 40 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, 40 Years For ANR Muddula Koduku, 40 Years of Muddula Koduku Movie, ANR Muddula Koduku Completes 40 Years, ANR Muddula Koduku Movie Turns 40 Years, ANR Muddula Koduku Telugu Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
40 Years For ANR Muddula Koduku

లెజెండ‌రీ యాక్ట‌ర్ అక్కినేని నాగేశ్వ‌రరావు, ద‌ర్శ‌క‌నిర్మాత వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత‌గా ఏఎన్నార్ కాంబినేష‌న్‌లో ప‌లు మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందించిన వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్… దర్శకుడిగా కూడా ప‌లు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన చిత్రాల‌లో ‘ముద్దుల కొడుకు’ ఒక‌టి. ఈ సినిమాని తన సొంత నిర్మాణ‌ సంస్థ‌ జ‌గ‌ప‌తి ఆర్ట్‌ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నిర్మించడమే కాకుండా… స్వీయ దర్శకత్వంలోనే రూపొందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. ఏఎన్నార్, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుమ్మ‌డి, ముర‌ళీమోహ‌న్, రాజ‌బాబు, గిరిజ‌, కె.వి.చ‌లం, మాస్ట‌ర్ హ‌రీష్‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌ భూమిక‌ల‌ను పోషించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె.వి.మ‌హ‌దేవ‌న్‌ స్వ‌ర‌క‌ల్ప‌నలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని పాట‌లన్నీ అప్పట్లో శ్రోత‌ల‌ను బాగా అల‌రించాయ‌నే చెప్పాలి. ముఖ్యంగా “చిట‌ప‌ట చినుకుల మేళం”, “చీక‌టి వెలుగుల కౌగిటిలో” పాట‌లు ఆల్ టైం హిట్స్‌గా నిలిచిపోయాయి. 1979 మే 3న విడుద‌లైన ‘ముద్దుల కొడుకు’… నేటితో 40 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

‘ముద్దుల కొడుకు’ – కొన్ని విశేషాలు:

  • వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో ఏఎన్నార్ న‌టించిన ఐదో సినిమా ‘ముద్దుల కొడుకు’. అంత‌కుముందు వీరి క‌ల‌యిక‌లో ‘దసరా బుల్లోడు’, ‘బంగారు బాబు’, ‘బంగారు బొమ్మలు’, ‘రామకృష్ణులు’ వ‌చ్చాయి. అంతేకాదు వీట‌న్నింటికి కె.వి.మ‌హ‌దేవ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చడం విశేషం.
  • ఏఎన్నార్ నటించిన పలు చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రీదేవి… ‘ముద్దుల కొడుకు’ సినిమాలో తొలిసారిగా ఏఎన్నార్ సరసన కథానాయికగా న‌టించింది. అనంతరం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘ప్రేమాభిషేకం’, శ్రీరంగనీతులు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ వ‌చ్చాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.