`దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` త‌రువాత మ‌రోసారి…

Will This Sentiment Work For Mahesh Babu Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prakash Raj Repeat The Same Sentiment For Mahesh Babu New Movie,Mahesh Babu Maharshi Movie Latest Updates,Mahesh Babu and Prakash Raj Same sentiment For Maharshi Movie,Will That Mahesh Babu Sentiment Work For Maharshi,Mahesh Babu To Continue His Sentiment With Prakash Raj
Will This Sentiment Work For Mahesh Babu Again?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమాలను నిశితంగా పరిశీలిస్తే… ఒక విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. అదేమిటంటే… మ‌హేష్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 25వ చిత్రం ‘మహర్షి’ వరకు దాదాపు 15 చిత్రాల్లో ఏదో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. ప్ర‌తినాయ‌కుడిగా, తండ్రిగా, మామ‌గా, అధికారిగా… ఇలా ప‌లు పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తాడు ప్ర‌కాష్‌. ఇక‌‘మహర్షి’ విష‌యానికొస్తే… ఇందులో మహేష్‌కి తండ్రిగా నటించాడు ప్ర‌కాష్ రాజ్‌. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో మహేష్‌కు నాన్న‌గా ప్రకాష్ రాజ్ నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మ‌హేష్‌కి తండ్రిగా ప్ర‌కాష్ రాజ్‌ నటించిన తొలి చిత్రం ‘దూకుడు’. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… మహేష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచింది. అలాగే… ఈ ఇద్ద‌రూ రెండోసారి తండ్రీకొడుకులుగా అలరించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో… ‘మహర్షి’లో ముచ్చటగా మూడోసారి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు ప్ర‌కాష్‌, మ‌హేష్‌. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా… మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి… దూకుడు, సీతమ్మ సిరిమ‌ల్లె చెట్టు త‌ర‌హాలో మ‌హ‌ర్షి కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుందేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=eTCgaFWwKQA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =