ఏప్రిల్ 28… “భలే మంచి రోజు పసందైన రోజు” అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పాడుకునే రోజు. తెలుగు సినీ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ తేది. ఎందుకంటే… ఏదో ఒక తేదీకి ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ రిలీజ్ అయితేనే ఎంతో ప్రత్యేకం. అలాంటిది… ఒకే తేదిన వేర్వేరు సంవత్సరాల్లో మూడు ఇండస్ట్రీ హిట్స్ విడుదలైతే… ఆ రోజు ఇంకెంత ప్రత్యేకం. అటువంటి ప్రత్యేకత కలిగిన తేది వివరాల్లోకి, జ్ఞాపకాల్లోకి ఒకసారి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అది 1977 ఏప్రిల్ 28… మహానటుడు యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ‘అడవిరాముడు’ విడుదలైన రోజు. కన్నడ చిత్రం ‘గంధద గుడి’(1972)కి రీమేక్‌గా తెరకెక్కిన ‘అడవిరాముడు’ ప్రేక్షకాదరణ పొంది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కట్ చేస్తే… మళ్ళీ 29 ఏళ్ళ అనంతరం అంటే… 2006 ఏప్రిల్ 28న సూపర్ స్టార్ మహేష్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ విడుదలైంది. మహేష్‌ను ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్‌ను చేసిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మళ్ళీ కట్ చేస్తే… ఈ సారి 11 ఏళ్ళ గ్యాప్… 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీపరిశ్రమ సత్తాను చాటిన ‘బాహుబలి2: ది కంక్లూజన్’ విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా మరో ఇండస్ట్రీ హిట్‌ను అందించింది. అంతేకాదు… బాలీవుడ్‌కి కూడా వసూళ్ళ పరంగా సవాల్ విసిరింది.
మొత్తమ్మీద… తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి… మన చిత్ర పరిశ్రమకు మహత్తర తేదిగా నిలిచింది ఏప్రిల్ 28. భవిష్యత్తులో కూడా ఈ తేది సెంటిమెంట్ ఇలాగే కొనసాగి మరిన్ని ఇండస్ట్రీ హిట్లు తెలుగు పరిశ్రమకు దక్కుతాయేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=qbvLbAgqaG4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























