మహేష్ కు హాలీవుడ్ హీరో ఆహ్వానం

Mahesh Babu gets invitation from Hollywood Actor Duke,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hollywood Offer For Super Star Mahesh Babu,Hollywood Actor invitation To Mahesh Babu,Mahesh Babu Latest Updates,Hollwood Actor Duke Welcomes To Mahesh Babu
Mahesh Babu gets invitation from Hollywood Actor Duke

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. మన వాళ్లు చేస్తున్న కొత్త ప్రయోగాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందుతున్నాము. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు నటుడు బిల్ డ్యూక్ తెలిసే ఉంటాడు. ‘కమాండో’,‘ప్రిడేటర్’,‘ఎక్స్ మెన్: ది లాస్ట్ స్టాండ్’ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి డ్యూక్ కన్ను సడెన్ గా మన దక్షిణాది స్టార్ పై, డైరెక్టర్లపై పడింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. డైరెక్టర్లు ఎవరనుకుంటున్నారా? ఇంకెవరూ.. టాలీవుడ్ టాప్ హీరో.. హాలీవుడ్ హీరోలకు సైతం పోటీనిచ్చే మహేష్ బాబు.. ఇక డైరెక్టర్లు ఎవరంటే వంశీ పైడిపల్లి.. ఏ.ఆర్ మురగదాస్. ‘వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌)లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం’ అని బిల్‌ ట్వీట్ చేశారు. ఇదే విధంగా మరో ట్వీట్‌లో ఎ.ఆర్‌.మురుగదాస్‌, మహేశ్‌బాబులను చర్చలకు ఆహ్వానించారు.

దీంతో సూపర్ స్టార్ ను ట్యాగ్ చేస్తూ ఒక హాలీవుడ్ హీరో ఇలా ట్వీట్ చేయడంతో మహేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి ఒక ప్రముఖ హాలీవుడ్ నటుడు మన హీరో, దర్శకుల్ని ఇలా ట్యాగ్ చేసి ఇంటర్నేషనల్ స్పై మూవీ గురించి మాట్లాడటం గొప్ప విషయమే. మొత్తానికి మన తెలుగు వాళ్ల సత్తా హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిందంటే ఆనందించాల్సి న విషయమే.

[subscribe]


[youtube_video videoid=P_wMsPd1zzk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =