నాగార్జున సినిమాలో బెంగ‌ళూరు బ్యూటీ

Actress Akshara To Play Guest Role In Nagarjuna Manmadhudu 2 Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Akshara To Act in Manmadhudu 2 Movie,Manmadhudu 2 Movie Latest Updates,Actress Akshara To Play a Cameo Role in Manmadhudu 2,Akshara Gowda To Play a Special Character Manmadhudu 2
Actress Akshara To Play Guest Role In Nagarjuna Manmadhudu 2 Movie?

కింగ్ నాగార్జున, గ్లామ‌ర్ సెన్సేష‌న్‌ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘మన్మథుడు2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా… ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా నాగ్, రకుల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బెంగ‌ళూరు బ్యూటీ అక్షర గౌడ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్పటికే ప‌లు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన అక్షర… ఇప్పుడు ‘మన్మథుడు2’తో తెలుగు తెర‌కు కూడా పరిచయం కాబోతోంది. మే నుంచి జరగబోయే షెడ్యూల్‌లో అక్షర ‘మన్మథుడు2’ టీంతో చేరనుందట‌. ఈ సినిమాలో త‌న‌ది అతిథి పాత్ర అని… అయితే ఎంతో స్పెష‌ల్‌గా, మ‌రెంతో ఎగ్జైటెడ్‌గా ఉంటుంద‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది అక్ష‌ర‌. ఈ సంద‌ర్భంగా… నాగార్జున, రాహుల్‌కి ధన్యవాదాలు కూడా తెలిపిందీ బెంగళూర్ బ్యూటీ. నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి రానుంది.

[subscribe]


[youtube_video videoid=rstFuW4ZDeU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =