‘బంగార్రాజు’తో అఖిల్ సందడి?

Akhil To Play A Guest Role In Nagarjuna Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akkineni Akhil To Play a Cameo Role in Nagarjuna New Movie,Akhil To Act in Nagarjuna Next Movie,Akhil To Play a Guest Role in Soggade Chinni Nayana 2 Movie,Hero Akhil New Movie Updates
Akhil To Play A Guest Role In Nagarjuna Movie

2016 సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున… తొలి భాగం తరహాలోనే తండ్రీ కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయంతో సందడి చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి భాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల… రెండో భాగానికి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా… త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

తొలి భాగంలో బంగార్రాజు కి జోడిగా నటించిన రమ్యకృష్ణ ఈ సీక్వెల్ లోనూ దర్శనమివ్వనుంది. అలాగే… రాము పాత్రకు జోడీగా లావణ్య త్రిపాఠి స్థానంలో నయనతార కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

కాగా… కథను కీలక మలుపు తిప్పే ఓ అతిథి పాత్రలో నాగ్ తనయుడు, యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ కనిపిస్తాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే అఖిల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది.

ఇంతకుముందు నాగ్ హీరోగా నటించిన ‘మనం’ సినిమాలో అఖిల్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి ఈసారి కూడా గెస్ట్ రోల్ లో అఖిల్ మురిపిస్తాడేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=c0frjVPcTKc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.