మురుగదాస్ కథతో త్రిష చిత్రం

Trisha To Play A Different Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Trisha New Movie News,Trisha To Act in Different Character,Trisha Next Project Details,Heroine Trisha Next Movie Updates
Trisha To Play A Different Role

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ’96’ తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడిగా ‘పేట’ లో మురిపించిన త్రిష… తాజాగా ఓ ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘గణేష్’ (2009), ‘జర్నీ’ చిత్రాల దర్శకుడు శరవణన్ డైరెక్షన్ లో త్రిష ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేయనుంది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిష ఓ డిఫరెంట్ రోల్ లో దర్శనమివ్వనుంది.

అంతేకాదు… ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కథను అందిస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇప్పటికే పలు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటించి మెప్పించిన త్రిష… ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోను తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=0y2hpww0EDM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =