మజిలీపై సెలబ్రిటీల ప్రశంసలు

Tollywood Celebrities About Majili Movie,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Celebs Response on Majili Movie,Majili Movie Gets Huge Response From Celebs,Majili Movie Latest Updates,Naga Chaitanya and Samantha Majili Movie Takes Good Response
Tollywood Celebrities About Majili Movie

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌశిక్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా మజిలీ. ఎన్నో అంచనాలు మధ్య ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముందు నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ నే దక్కించున్న ఈసినిమా.. రిలీజ్ అయిన తరువాత కూడా పాజిటివ్ రివ్యూస్ నే దక్కించుకుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగచైతన్య, సమంత నటనకు ఫిదా అయిపోతున్నారు. అటు లవర్ బాయ్ గా… ఇటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చైతు చాలా బాగా నటించాడని.. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే తన నటనతో కట్టిపడేశాడని ప్రశంసిస్తున్నారు. ఇక ఈసినిమాను చూసిన నాగార్జున ఇప్పటికే కొడకు కోడలి నటనను ప్రశంసించగా.. పలువురు సెలబ్రిటీలు సైతం చైసామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరీశ్‌ శంకర్‌: ‘ప్రపంచంలోని ప్రశంసలన్నీ చైతన్య, సమంత దంపతులకు దక్కాలి. కుడోస్‌ శివ నిర్వాణ. తమన్‌ తన నేపథ్య సంగీతంతో భావోద్వేగ సన్నివేశాలకు ప్రాణం పోశారు. కచ్చితంగా ‘మజిలీ’ సినిమాను చూడండని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

 

మంచు మనోజ్‌: ‘క్యూట్‌ దంపతులు చైతన్య, సమంత కలిసి అందించిన అందమైన భావోద్వేగాల ప్రయాణం ‘మజిలీ’. సినిమా చక్కటి అనుభూతి ఇచ్చింది. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’.

 

మంచు లక్ష్మి: ‘‘మజిలీ’ సినిమా అమోఘం. ఇది హృదయాన్ని తాకిన ఓ నిజాయతీ ప్రేమకథ. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చూశా. సామ్‌, చై తమ నటనతో అదరగొట్టారు..లేదు చంపేశారు. మొత్తం చిత్ర బృందం సూపర్‌గా నటించింది. శివ నిర్వాణకు హ్యాట్సాఫ్‌. మీపై ఇంకా గౌరవం పెరిగింది. వెళ్లి సినిమాను చూడండి అని ట్వీట్ చేసింది.

 

హేమంత్‌ మధుకర్‌: ‘ఇప్పుడే ‘మజిలీ’ చూశా. ఇది ఓ క్లాసిక్‌ లవ్‌స్టోరీ. శివ నిర్వాణ కథను చక్కగా రాశారు. చైతన్య, సమంత నటన అద్భుతం. దివ్యాన్ష క్యూట్‌గా కనిపించారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’.

 

మధుర శ్రీధర్‌ రెడ్డి: ‘‘మజిలీ’ లాంటి అందమైన, నిజాయతీ, భావోద్వేగాలు కల్గిన సినిమాను మాకిచ్చినందుకు శివ నిర్వాణకు ధన్యవాదాలు. చైతన్య, సమంత.. మీ ప్రదర్శన అత్యధ్భుతం. తెలుగు సినిమాల్లో ‘మజిలీ’ ఓ చక్కటి ప్రేమకథగా నిలిచిపోతుంది’.

బాబీ: ‘‘మజిలీ’ నా మనసును తాకింది. చైతన్య, సమంత ది బెస్ట్‌. దర్శకుడు శివ నిర్వాణ ప్రేమకు కొత్త అర్థం చెప్పారు. తమన్‌ చక్కటి నేపథ్య సంగీతం అందించారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. చైతన్య రెండు షేడ్స్ లోనూ బావున్నారు. మరోసారి నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ప్రశంసించారు.

[subscribe]

[youtube_video videoid=IkgokI21cW8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 6 =