బాబి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో ‘వెంకీమామ’ అనే మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసరప్రాంతాల్లో జరుగుతోంది. వెంకీ .. చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించగా… రీసెంట్ గా రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కూడా జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా షూటింగ్ తాజా అప్ డేట్ ఏంటంటే.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ కు ‘వెంకీమామ’ నుండి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రైజ్ ను ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకీ, చైతు సరసన.. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేష్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ‘ఎఫ్ 2’ తరువాత వెంకటేష్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో… మామఅల్లుళ్ళు బాక్సాఫీస్ వద్ద ఎంత హడావుడి చేస్తారో? చూద్దాం..
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: