సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదితో కథానాయకుడిగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాడు. అంతేకాదు… ఈ లోపే తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)తో అభిమానులను ఖుషీ చేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయ్యిందని సమాచారం. కాగా… మిగిలి ఉన్న రెండు పాటల చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. అందులో ఒక పాటని హైదరాబాద్‌లోనూ… మరో పాటని దుబాయ్‌లోనూ చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీంతో… `మహర్షి`కి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలు పూర్తవుతాయి. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి… మే 9న వేసవి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. `మహర్షి`లో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా… కీలక పాత్రలో `అల్లరి` నరేష్ నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: