2007లో “చిరుత” చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ ఈ పన్నెండేళ్ల ప్రస్థానంలో 12 చిత్రాల్లో మాత్రమే నటించారు. సంఖ్యాపరంగా అది చాలా తక్కువే అయినప్పటికీ ఇమేజ్ పరంగా రామ్ చరణ్ తొలి చిత్రం నుండే గొప్ప ఫామ్ లో ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2 వ చిత్రమైన “మగధీర”, 11వ చిత్రమైన” రంగస్థలం” తో కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించిన రామ్ చరణ్ నటన పరంగా కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ పన్నెండేళ్లలో రామ్ చరణ్ నటించిన మొత్తం 12 చిత్రాలు విజయవంతం కాలేదు. తొలి రెండు చిత్రాలు చిరుత, మగధీర హిట్ అవగా ఆరంజ్ ఫెయిల్యూర్ తో గొప్ప హ్యాట్రిక్ అవకాశాన్ని మిస్ అయ్యాడు రామ్ చరణ్. ఆ తరువాత వచ్చిన రచ్చ, నాయక్ చిత్రాలు విజయవంతం కాగా తుఫాన్ ఫెయిల్యూర్ తో మరొకమారు హ్యాట్రిక్ కొట్టే గోల్డెన్ ఆపర్చునిటీని మిస్సయ్యారు.
ఆ తరువాత ఎవడు? హిట్ట్ , గోవిందుడు అందరివాడేలే యబో యావరేజ్ అవ్వగా బ్రూస్ లీ తో మరోమారు హ్యాట్రిక్ మిస్ అయ్యారు చరణ్. ఆ తరువాత “ధ్రువ” యబో యావరేజ్ కాగా “రంగస్థలం” stupendous హిట్ అయింది. కానీ ఆ వెంటనే వచ్చిన “వినయ విధేయ రామ” డిజాస్టర్ అవటంతో ఇంకోమారు హ్యాట్రిక్ మిస్ అయింది. ఈ విధంగా 12 సంవత్సరాల్లో 12 సినిమాల్లో నాలుగు సార్లు హ్యాట్రిక్ మిస్ అవ్వటం బాధాకరమే అయినప్పటికీ హిట్ అయిన సినిమాల ద్వారా రామ్ చరణ్ కు లభించిన, లాభించిన పేరు ప్రఖ్యాతులు విశేషమైనవి. అయితే విజయవంతమైన హిట్ సినిమాల్లోనే కాదు ఫెయిల్యూర్ చిత్రాలలో సైతం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అయితే ఇక్కడ “విజయం” ధ్వనించినంత బిగ్గరగా ఫెయిల్యూర్ ధ్వనించదు. అందుకే విజయవంతం కాని నాలుగు చిత్రాలను పక్కన పెట్టి మిగిలిన ఎనిమిది చిత్రాలలో మీకు నచ్చిన “ది బెస్ట్ ఆఫ్ రామ్ చరణ్” ఏది ? అని సరదాగా ఒక పోల్ గేమ్ పెడితే మీరు దేనికి ఓటేస్తారో చూద్దాం.
ఇంతకీ ఇంత సడన్ గా రామ్ చరణ్ సినిమాల మీద ఈ పోల్ గేమ్ ఏమిటి అనుకుంటున్నారా?
ఈరోజు మార్చి27- రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పెట్టిన ఈ పోల్ గేమ్ లో మీరు ఏ సినిమా ను సెలెక్ట్ చేస్తే అదే “రామ్ చరణ్ బెస్ట్” అవుతుంది.
So.. dont forget that your voting is your greeting.
[totalpoll id=”17880″]
[youtube_video videoid=JqkJy_bsmk0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: