మ‌రోసారి నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా?

Interesting Update About Tamannaah Latest Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah New Movie Updates,Actress Tamannaah Play a Negative Role in Her Next Movie,Tamannaah Next Project Details,Tamannaah Role in Her New Film
Interesting Update About Tamannaah Latest Movie

తెలుగు, త‌మిళ, హిందీ… ఇలా త్రిభాషా సూత్రంతో కెరీర్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది అందాల తార త‌మ‌న్నా. ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్‌… మ‌రో వైపు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ… యాక్టింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే… తాజాగా త‌మ‌న్నా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌కి ఓకే చెప్పింద‌ని కోలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… విశాల్ క‌థానాయ‌కుడిగా సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో ఓ త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే… ఈ పాత్ర‌లో నెగ‌టివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని స‌మాచారం. మైండ్ గేమ్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో త‌మ‌న్నా పాత్రే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని టాక్‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… కెరీర్ ఆరంభంలోనే `కేడి` (2006) (ర‌వికృష్ణ‌, ఇలియానా హీరోహీరోయిన్లు) అనే త‌మిళ‌ చిత్రంలో ఇలా నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది త‌మ్మూ. మ‌రి… సుదీర్ఘ విరామం త‌రువాత ఆ త‌ర‌హా పాత్ర‌లోనే క‌నిపించ‌నున్న మిల్కీ బ్యూటీకి ఈ సారి ఎలాంటి గుర్తింపు ద‌క్కుతుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=8VSYF73nG6M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =