కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా… `నాన్న` సెంటిమెంట్‌తో ఆయన రూపొందించిన పలు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. తొలి చిత్రం `నువ్వే నువ్వే`తో మొదలుపెట్టి గత చిత్రం `అరవింద సమేత` వరకు సింహభాగం `నాన్న` చుట్టే తన కథలను అల్లుకున్నారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో… మరో `నాన్న` సెంటిమెంట్ చిత్రంతో పలకరించనున్నాడు త్రివిక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే తన దర్శకత్వంలో రెండు సార్లు నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టైలిష్ మేకర్. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే… `నాన్న…నేను..`. మరి… ఈ టైటిల్ కి సంబంధించిన వార్తలో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెల్యులాయిడ్ పైకి రానుంది.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: