‘కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌’ సినిమా ప్రారంభం

Kausalya Krishnamurthy Cricketer Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kausalya Krishnamurthy Cricketer Movie Shoot,Kausalya Krishnamurthy Cricketer Movie Latest Updates,Kausalya Krishnamurthy Cricketer Movie Shooting News,Kausalya Krishnamurthy Cricketer Movie Launched
Kausalya Krishnamurthy Cricketer Shoot Begins

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో ‘కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్‌’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివాస గృహంలో నేడు ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హీరో కార్తీక్‌రాజు, హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌నివ్వగా, ఈస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్‌ జరుగుతుంది. కాగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”సూపర్‌గుడ్‌, ఎడిటర్‌ మోహన్‌ వంటి బేనర్స్‌లో సినిమాలు చేశాను. అయితే ఎప్పటినుంచో కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో సినిమా చెయ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ”విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఐశ్వర్య ఒక టీజర్‌ చూపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్రికెటర్‌గా బౌలింగ్‌, బ్యాటింగ్‌ అద్భుతంగా చేసింది. తర్వాత ఆ కథ చెప్పి, ఆ రైట్స్‌ కొనిపించి తెలుగులో నన్నే తియ్యమని చెప్పింది. అలా ఈ సినిమా మొదలవడానికి ఐశ్వర్యా రాజేషే కారణం. తను ఆల్రెడీ తమిళ్‌, మలయాళంలో సినిమాలు చేసినా ఫిమేల్‌ క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది. అలాగే మా వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే క్యారెక్టర్‌ చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది” అన్నారు.

హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ ”మణిరత్నంగారి ‘నవాబ్‌’ సినిమా ద్వారా నేను తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైనప్పటికీ డైరెక్ట్‌గా తెలుగులో కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. తమిళ్‌లో ఈ సినిమా చేసేటపుడు ఆరు నెలలపాటు క్రికెట్‌ నేర్చుకొని ఈ క్యారెక్టర్‌ చేశాను. నాకు మంచి పేరు తెచ్చిందా సినిమా. ఆ సినిమా టీజర్‌ చూపించగానే కె.ఎస్‌.రామారావుగారు ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. కథ అడిగి తెలుసుకున్నారు. తెలుగులో చేస్తే బాగుంటుంది అనగానే వెంటనే ఓకే చెప్పారు. 20 రోజుల్లో షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోయింది. తెలుగులో కూడా ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది. మా తాత అమర్‌నాథ్‌గారు ఒకప్పటి హీరో, మా అత్తయ్య శ్రీలక్ష్మిగారు హాస్యనటిగా అందరికీ తెలుసు. మా నాన్న రాజేష్‌గారు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. మా ఫ్యామిలీలో అందర్నీ ఆదరించిన ప్రేక్షకులు నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో కార్తీక్‌రాజు మాట్లాడుతూ ”ఇంతకుముందు నేను రెండు, మూడు సినిమాలు చేశాను. అయితే కె.ఎస్‌.రామారావు అంకుల్‌ బేనర్‌లో చాలా మంచి హీరో క్యారెక్టర్‌ ఇచ్చారు. ఈ క్యారెక్టర్‌ నాకు హీరోగా మంచి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ ”ఈ సినిమా కథ చాలా బాగుంది. ఇందులో నాది మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యారెక్టర్‌. ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.

రచయిత హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ ”భీమనేనిగారు చేసిన సుడిగాడు సినిమాకి వర్క్‌ చేశాను. కెజిఎఫ్‌ చిత్రం తర్వాత తెలుగులో ఈ సినిమాతో మరో మంచి అవకాశం వచ్చింది. కె.ఎస్‌.రామారావుగారి ఆఫీస్‌కి వెళ్తేనే గొప్ప అనుకునే నాకు వారి బేనర్‌లో సినిమాకి రాసే అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాను” అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ ఐ.ఆండ్రూబాబు మాట్లాడుతూ ”కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో చాలా మంచి సినిమాలు చేశాను. మళ్ళీ ఈ బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుంది” అన్నారు.

కాగా ఇంకా ఈసినిమాలో డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌రాజు, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, రంగస్థలం మహేష్‌, విష్ణు(టాక్సీవాలా), శశాంక్‌, రవిప్రకాష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూబాబు, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, గౌరవ రచన పర్యవేక్షణ: సాయిమాధవ్‌ బుర్రా, మాటలు: హనుమాన్‌ చౌదరి, సంగీతం: ధిబు నినన్‌ థామస్‌, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

[subscribe]

[youtube_video videoid=O7JTB4ya-x8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.