ధర్మా ప్రొడక్షన్స్, నడియాడ్ వాలా గ్రాండ్ సన్ బ్యానర్స్ పై అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, సంజయ్ దత్ , వరుణ్ థావన్ , ఆదిత్య రాయ్ కపూర్ వంటి భారీ తారా గణంతో జీవితానికన్నా మిన్న కథ తో రూపొందిన మల్టీ స్టారర్ హిందీ మూవీ “కళంక్ ” ఏప్రిల్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సాంగ్ లో హీరోయిన్స్ కియారా అద్వాణీ, కృతి సనన్ అతిథి పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాత ఢిల్లీ లోని మహల్ ప్రతిబింబించేలా ముంబై ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ రూపొందించి “కళంక్ ” మూవీ షూటింగ్ జరిపారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మార్చి 7వ తేదీ సంజయ్ దత్ , వరుణ్ థావన్ , ఆదిత్య రాయ్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, మార్చి 8వ తేదీ మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మార్చి 12వ తేదీ ముంబై లో “కళంక్ ” మూవీ టీజర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ చూడగానే భావోద్వేగాల ప్రేమకథతో “కళంక్ ” మూవీ రూపొందనే అభిప్రాయం కలుగుతుంది.”కళంక్ ” మూవీ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్15 సంవత్సరాల కల.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: