ఆర్జీవితో టైటిల్ కార్డ్ షేర్ చేసుకుంటున్న అగస్త్య మంజు ఎవరు

Who is Lakshmi’s NTR another director Agastya Manju?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Another Director For Lakshmi’s NTR,Lakshmi’s NTR Movie Latest Updates,Lakshmi’s NTR Movie Directors RGV and Agastya Manju,RGV Added Another Director in Lakshmi’s NTR
Who is Lakshmi’s NTR another director Agastya Manju?

“ హితుడా .. నీకు అంగ రాజ్యమునే కాదు నా అర్ధ సింహాసనాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాను”..అని “దాన వీర శూర కర్ణ “చిత్రంలో ఒక డైలాగు చెప్తారు ఎన్టీఆర్. నిజానికి ఎవరైనా తమదైన ఆస్తి, అధికారం, హక్కుల నుండి అర్థభాగాన్ని వేరొకరికి దారాదత్తం చేశారు అంటే అది వారి మధ్య ఉన్న అభిమాన, అనుబంధాలకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే అర్ధ భాగం, అర్ధనారీశ్వరం,అర్ధ సింహాసనం వంటి కాన్సెప్ట్స్ కు మన సమాజంలో ఎంతో విలువ ఉంది. అందుకే ఎవరైనా ఎవరికైనా ఎందులోనైనా అర్థ భాగం ఇస్తున్నారు అంటే అది ఆలోచించాల్సిన విషయమే. అందునా రాంగోపాల్ వర్మ లాంటి విలక్షణ, విశిష్ట, విచిత్ర, వింత వ్యక్తి తను దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రెడిట్స్ లో సగభాగాన్ని తన అసోసియేట్ డైరెక్టర్ కు ఆపాదిస్తూ టైటిల్ కార్డ్స్ లో తనతో పాటు అతని పేరు కూడా వేయటం సంథింగ్ స్పెషల్ , సంథింగ్ గ్రేట్, సంథింగ్ న్యూ , సంథింగ్ అన్ యూజువల్ గా అనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు విషయానికి వస్తే సంచలనాల కేంద్రబిందువైన రామ్  గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతున్న వివాదాస్పద చిత్రం
” లక్ష్మీస్ ఎన్టీఆర్” టైటిల్ కార్డ్స్ లో దర్శకత్వం ” రామ్ గోపాల్ వర్మ- అగస్త్య మంజు” అనే రెండు పేర్లు కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఒక సినిమాకు ఇద్దరు దర్శకులు పనిచేయటం, టైటిల్ కార్డ్స్ లో ఇద్దరి పేర్లు వేయటం  చాలా అరుదుగా జరుగుతుంది.
అందులో ఇద్దరు సమ ఉజ్జీలైన దర్శకుల పేర్లు ఉంటే అదొక లెక్క… కానీ ఇప్పటివరకు దర్శకుడిగా టైటిల్ కార్డు లేని అసోసియేట్ డైరెక్టర్ అగస్త్య మంజు కు రామ్ గోపాల్ వర్మ తన టైటిల్ కార్డులో షేర్ ఇవ్వటం  అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇంతకూ ఎవరీ ” అగస్త్య మంజు”?ఇతని అసలు పేరు ‘మంజు మాదినేని’.

చాలాకాలంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మంజు రాంగోపాల్ వర్మ వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా  పనిచేశాడు. అయితే “లక్ష్మీస్ ఎన్టీఆర్” విషయంలో మంజు  కృషి చాలా ఎక్కువగా ఉందట.  బయోపిక్ తరహా చిత్రం కావటంతో విషయ సేకరణ మొదలు ప్రతి విషయంలోనూ అత్యంత శ్రద్ధాసక్తులతో పనిచేయటం వల్ల రాంగోపాల్ వర్మ బాగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే అతని శ్రమకు, కష్టానికి తగిన గుర్తింపునిస్తూ టైటిల్ కార్డ్స్ లో తన పేరు సరసన మంజు పేరు కూడా వేసారట వర్మ. అయితే కేవలం మంజు అని వేయటం వల్ల సౌండింగ్ ఇంప్రెసివ్ గా లేదని మంజుకు ముందు అగస్త్య  చేర్చి ‘ అగస్త్య మంజు’ అని వేశారు. ఇది నిజంగా ఒక అరుదైన విషయం… విశేషం.

కథా చౌర్యం, శ్రమ చౌర్యం  వంటి ప్రచ్ఛన్న దోపిడీ ఎక్కువగా ఉండే చిత్ర పరిశ్రమలో ఒకరి కష్టానికి, ప్రతిభకు నిజమైన గుర్తింపునిస్తూ రాంగోపాల్ వర్మ ‘అగస్త్య మంజు’ కు ఇలా అర్థ ఘనతను కట్టబెట్టడం అభినందనీయం.సంచలనాలు, వివాదాల విషయంలోనే కాదు ఇలాంటి సౌహార్ద సత్కార్యాలలో కూడ రాంగోపాల్ వర్మ తన రూటే సెపరేటు అనిపించుకోవటం బాగుంది.
Keep it up Mr.Varma.

[subscribe]

[youtube_video videoid=6AkRqCs43zc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =