ఈసారి ‘అవసరం’ అంటున్న వర్మ

Avasaram Song From Lakshmi's NTR To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avasaram Song From Lakshmi's NTR Out Soon,Lakshmi's NTR Movie Songs,Another Song From Lakshmi's NTR Movie,RGV Reveals Avasaram Song From Lakshmi's NTR
Avasaram Song From Lakshmi's NTR To Be Unveiled Tomorrow

ఇప్పటికే ‘వెన్నుపోటు’, ‘ఎందుకు’ అంటూ అందరికీ షాకిచ్చిన వర్మ ఇప్పుడు మరోసారి అవసరం అంటూ మరో షాకివ్వడానకి రెడీ అయ్యాడు. ఈ సినిమా నుండి ఒక్కో పాటను వదులుతూ సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్నాడు వర్మ. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘అవసరం’ అనే పాటను రేపు (మార్చి 7) ఉదయం 9.27 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఈ సాంగ్ లో వర్మ ఏం చూపిస్తాడో.. ఏం షాకిస్తాడో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు వర్మ. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు.

ఇక ఈసినిమాకు స్పెషల్ గా ప్రమోషన్స్ అంటూ ఏం అవసరంలేదనిపిస్తుంది. వర్మ ఒక్కడే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల కంటే కూడా వర్మ సినిమా కోసమే చాలా మంది వైయిట్ చేస్తున్నారంటేనే అర్దం చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=WbtiDxR1DZY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =