హీరోగా అతని తొలి చిత్రం “గంగోత్రి” లో మీసాలు లేని పేడి మూతిని చూసి ఎవరీ కోతి అన్నారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ హీరోగా అతని భవిష్యత్తును మాత్రం నిర్ధారించలేక పోయింది. బాయ్ కి ఎక్కువ- మ్యాన్ కు తక్కువ అయిన వయసు, పర్సనాలిటీతో అయోమయంలో ఉన్న ఆ కుర్రాడు ఇమ్మిడియట్ సినిమాతో ఇన్క్రెడిబుల్ హిట్ కొడతాడని ఎవరు ఊహించలేదు. ఆ హిట్ సినిమా “ఆర్య” అయితే ఆ కుర్రాడు “అల్లు అర్జున్”. రెండవ సినిమాకే ఇమేజ్ లో, బాడీ లాంగ్వేజ్ లో అంత ఓవర్ నైట్ హైప్ సాధించిన అల్లు అర్జున్ చూస్తుండగానే స్టైలిష్ స్టార్ గా, యూత్ ఐకాన్ గా ఎదగటం ఆశ్చర్యకరం, అభినందనీయం. అల్లు అర్జున్ ను అంత అమాంతంగా అందలాలు ఎక్కించిన సినిమా “ఆర్య” కాగా ఆ చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్య 2004 మే 7 న విడుదల కాగా ఐదేళ్ల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య 2 నవంబర్ 27 – 2009 న విడుదలయ్యింది. ఈ రెండు చిత్రాలు అద్భుత విజయాలను సాధించి అల్లు అర్జున్ – సుకుమార్ లది సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నప్పటికీ అది రిపీట్ అవ్వటానికి పది సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ హిట్ కాంబోను రిపీట్ చేస్తున్న క్రెడిట్ హ్యాట్రిక్ చిత్రాల సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ “మైత్రి మూవీ మేకర్స్” కు దక్కుతుంది.
లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్టు పదేళ్ల తరువాత రిపీట్ అవుతున్న హిట్ కాంబినేషన్ మరో సంచలన విజయానికి శ్రీకారం అవుతుంది అనటంలో సందేహం లేదు.
“నా పేరు సూర్య” వంటి మంచి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో కొంచెం ఆలోచించుకునే టైమ్ తీసుకున్న అల్లు అర్జున్ ఇద్దరు అగ్ర దర్శకుల దర్శకత్వంలో వరసగా రెండు చిత్రాలను పట్టాలు ఎక్కించటం పట్ల మెగా కాంపౌండ్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు.
“#AA20” గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఆగస్టులో ప్రారంభమవుతాయని మైత్రి మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన శివరాత్రి సందర్భంగా వెలువడటం శుభ సూచకం.
ఆల్ ద బెస్ట్ టు అల్లు అర్జున్, సుకుమార్ అండ్ మైత్రి మూవీ మేకర్స్.
[youtube_video videoid=W49QmLCHBFw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.