రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తారక్ హాలీడే ట్రిప్ లో ఉండగా… రామ్ చరణ్ మాత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై మొదటి నుండి పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ స్టోరీ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములంటూ.. బాక్సర్లంటూ.. ఇంకా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అంటూ అబ్బో ఇలా ఒకటేమిటి చాలా వార్తలే వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో రామ్ చరణ్ త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడట. బ్రిటిష్ ఆఫీసర్ గా, మాస్ లీడర్ గా మరియు ఫ్రీడమ్ ఫైటర్ గా మూడు గెటప్స్ లో కనిపించనున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు వచ్చే నెల ఉంది కాబట్టి.. ఆ సందర్భంగా సినిమాలోని చెర్రీ లుక్‌ను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
కాగా దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు కానీ… ఇలాంటి గాసిప్స్ మాత్రం రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. ఇక రాజమౌళినే వీటిపై క్లారిటీ ఇవ్వాలి.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: