ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ విరించి వర్మ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=KypNI5ug4vk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: