మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోంది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారని, ఆయన్ను తెరపై చూస్తుంటే ఆ రాజన్ననే చూసినట్టు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు దర్శకుడు మహి పై కూడా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు.. చాలా బాగా సినిమాను తీశాడని ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న స్పందనపై మహి.వి రాఘవ్ స్పందిస్తూ ఓ పోస్ట్ ద్వారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా నా లైఫ్ లో ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా.. ఈ సినిమా తీయడం కంటే విలువైంది ఏదీ లేదు నాకు….. ఇది కేవలం ఆయన జీవిత చరిత్రలో ఒక పార్ట్ మాత్రమే.. ఈ సినిమా చూసిన తరువాత నేటి తరం యువత ఆయన గురించితెలుసుకోవాలనుకున్న… అంతేకాని ఎవరో పొగడ్తల కోసం నేను ఈ సినిమా తీయలేదని అన్నారు. కానీ వైఎస్ అభిమానులు ఆయనను ఆరాధించేవారు.. సెలబ్రిటీస్ దగ్గర వెళ్లి యాత్ర గురించి మాట్లాడటం..దాని గురించి చెప్పండని చెప్పడం ఇది నాకు, నా వర్క్ కు చాలా అవమానం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేనేం బెగ్గర్ ను కాదు..నాకు ఎలాంటి ప్రశంసలు అవసరం లేదన్నారు.
[youtube_video videoid=7Gg9SbI1X6s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: