వైవిధ్యంగా ఆలోచించటం-
వైవిధ్యంగా పనిచేయటం-
వైవిధ్యంగా రాణించడం-
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇవే ఒక సెలబ్రిటీని ఇతర సెలబ్రిటీల సమూహం నుండి సెపరేట్ చేసి ఒక ప్రత్యేక తరహా సెలబ్రిటీగా నిలబెడతాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. వారిలో ఎవరి పంథా వారిదే… ఎవరి ప్రత్యేకత వారిదే. కానీ 1996 లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమైన “పవన్ కళ్యాణ్” కు మాత్రం ఒక ప్రత్యేక తరహా ఇమేజ్ ఏర్పడింది. ఒకవైపు అన్న చాటు తమ్ముడుగా, అన్న అభిమానిగా, అన్న అభిమాన సైన్యాల అధ్యక్షుడిగా కొనసాగుతూనే మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్.
మొదటి నుండి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం కొంచెం తేడాగానే ఉండేది. ఏ విషయంలోనైనా సంప్రదాయ విధానాలను గౌరవిస్తూనే సంప్రదాయేతరంగా ఆలోచించడాన్ని “లెఫ్ట్ ఓరియంటేషన్” అంటారు. వ్యక్తిగత జీవితంలోనైనా, సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలో నైనా Out of the Box గా ఆలోచించటం వల్లనే పవన్ కళ్యాణ్ కు ఈ ప్రత్యేక తరహా ఇమేజ్ ఏర్పడింది.
నిజానికి పవన్ కళ్యాణ్ పదుల సంఖ్యలో సినిమాలు చేయలేదు. ఆయన హీరోగా చేసినవి 23 చిత్రాలే.శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో చేసిన గెస్ట్ రోల్స్ తో కలుపుకొని పవన్ కళ్యాణ్ చిత్రాల సంఖ్య కేవలం 25 మాత్రమే.
To be frank and honest… పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఆ ఇరవై మూడు చిత్రాలలో విజయాల సంఖ్య కంటే అపజయాల సంఖ్యే ఎక్కువ. కానీ క్రేజ్ అండ్ ఇమేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ చరిష్మా ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. కేవలం 23 సినిమాల హీరోకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అర్థం కాదు.
ఇంతకూ ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించిన ఈ ప్రత్యేక ప్రస్తావన, ప్రత్యేక ప్రశంస అనుకుంటున్నారా … నిజమే.. సందర్భం ఏమీ లేదు.. ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి కొత్త ప్రకటనలు లేవు. మరి ఇప్పుడు సడన్ గా ఆయన ఎందుకు గుర్తుకు వచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే… ఎందుకో తెలియదు… అలా గుర్తొచ్చారంతే… ఎండనక వాననక… పగలనక రేయనక అలా జనంలో పడి తిరుగుతున్న “జనసేన” అధ్యక్షున్ని చూస్తుంటే సినిమా అనే ఈ గ్లామర్ ప్రపంచాన్ని వదిలివెళ్లిన ఒక పవర్ ఫుల్ బాక్సాఫీస్ స్టార్ తాలూకూ సంచలన విశేషాలు గుర్తుకొచ్చి… we miss you పవన్ కళ్యాణ్ అనిపించింది.
పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి సంవత్సరం దాటింది. గత సంవత్సరం జనవరి 10న విడుదలైన “అజ్ఞాతవాసి”తరువాత సినిమా రంగానికి సంబంధించినంతవరకు పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పకపోయిఉంటే ఇప్పటికీ ఒకటో రెండో సినిమాలు చేసి ఉండేవారు.. మరో ఒకటో రెండో సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉండేవి. నిజానికి మన టాలీవుడ్ అగ్రతారల జాబితా నుండి పవన్ కళ్యాణ్ నిష్క్రమణ జరిగి ఉండకపోతే మొన్నటి సంక్రాంతికి బాక్సాఫీస్ మరింత సందడిగా మారి ఉండేది. “అజ్ఞాతవాసి” లాంటి ఒక ప్లాప్ సినిమా ఇచ్చినందుకు ” అత్తారింటికి దారేది” లాంటి ఒక ప్రతీకార విజయం పవన్ కళ్యాణ్ నుండి వచ్చి ఉండేది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రంగంలో ఉండి ఉంటే “ఆ కిక్కే వేరప్పా” అనిపిస్తుంది.
సరే!- సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్, స్టామినాల ప్రభావాన్ని ఒక పరిశీలనాత్మక అంశంగా విశ్లేషిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి చేసిన సినిమాల సంఖ్య తో పోల్చితే పవన్ కళ్యాణ్ సక్సెస్ రేట్ చాలా తక్కువే. విజయాల కంటే అపజయాలు, యావరేజ్ లే ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇంత sky touching ఇమేజ్ ఎలా వచ్చింది.. ? అన్నది ఒక జవాబు లేని ప్రశ్న. అయితే ఎనలైటికల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ జయాపజయాలకు అతీతమైనదిగా ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలు కనిపిస్తాయి. అవేమిటో పాయింట్ వైజ్ గా చూద్దాం.
* పవన్ కళ్యాణ్ కు జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ ఏర్పడటానికి ఆయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కావటం ప్రధమ కారణం అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. నాలుగు దశాబ్దాలుగా తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైన చిరంజీవి తాలూకు రూట్ లెవెల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది ఒక్క పవన్ కళ్యాణ్ కే కాదు ఆ కాంపౌండ్ హీరోలు మొత్తానికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. అది ఒక శాశ్వతమైన, పటిష్టమైన ప్రొటెక్షన్ రూఫ్.
* ఇక చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ కార్డ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కు తొలి చిత్రం” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”ఒక స్క్రీన్ టెస్ట్ గా ఉపకరించింది.ఆ తరువాత వరుసగా వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాల డబుల్ హాట్రిక్ తో ఏర్పడిన foundation strength పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనే Four Pillars Charminar తరువాత టాలీవుడ్ అనే హై టెక్ సినీ సిటీలో వెలసిన ఒక సరికొత్త” సైబర్ టవర్” పవన్ కళ్యాణ్.
* పవన్ కళ్యాణ్ కు ఇంత స్ట్రాంగ్ ఇమేజ్ ఏర్పడటానికి మరొక ప్రధాన కారణం అతనొక యూత్ ఐకాన్ కావటం. అయితే అది అంత ఈజీగా వచ్చిపడిన ఇమేజ్ కాదు. లేట్ నైన్టీస్ లో సొసైటీలో టెక్నాలజీ పరంగా, ఫ్యాషన్స్ పరంగా గ్లోబలైజేషన్ తాలూకు ట్రాన్స్ మిషన్ జరుగుతున్న ఒక సంధి సమయంలో యూత్ ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక యంగ్, డైనమిక్ అండ్ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న హీరో కావాలి అనే వ్యాక్యూమ్ ఏర్పడింది… కరెక్ట్ గా ఆ వాక్యూమ్ ను ఫిలప్ చేసే క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ లో యూత్ కు కనిపించాయి. ఇలా ట్రాన్స్మిషన్ పిరియడ్ తాలూకు అడ్వాంటేజ్ అనేది అప్పట్లో చిరంజీవికి, ఆ తర్వాత జనరేషన్లో పవన్ కళ్యాణ్ కు బాగా హెల్ప్ అయింది. అంతకుముందు జనరేషన్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల Five Bunch Stardom ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ స్టార్ గా చిరంజీవి ఎలా దూసుకొచ్చారో ఆ తరువాత జనరేషన్ కు Representing Star గా కనిపించాడు కాబట్టే పవన్ కళ్యాణ్ కు ఇలా జయాపజయాలకు అతీతమైన ఇంత స్ట్రాంగ్ ఇమేజ్ ఏర్పడింది.
ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా ఇన్ జనరల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు వచ్చిన ప్లాప్స్ అండ్ యావరేజ్ లకు మరో హీరో అయితే అడ్రస్ కూడా దొరికేది కాదు. సో… ఒక సంధి సమయానికి సరైన ప్రతినిధిగా దూసుకు రావటమే పవన్ కళ్యాణ్ లాంగ్ అండ్ స్ట్రాంగ్ ఇమేజ్ కి మరొక ప్రధాన కారణం.
* ఇక చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్ ల లాస్ట్ జనరేషన్ లోనే కాదు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్ లో కూడా ఏ ఇతర స్టార్ కు లేని మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ లో మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు జనరేషన్ స్టార్స్ లో ఎవరికీ ” డైరెక్టర్” అనే క్రెడిట్ లేదు. ఆయన డైరెక్ట్ చేసిన “జానీ” చిత్రం రిజల్ట్ ఏమైనప్పటికీ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ తరువాత ” డైరెక్టర్” అనే టైటిల్ కార్డ్ ఉన్న ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే.
* ఇక ఇతరత్రా మల్టిపుల్ టాలెంట్స్ విషయానికి వస్తే- పవన్ కళ్యాణ్ లో ఒక సింగర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక ఫైట్ కంపోజర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక ప్రొడ్యూసర్ కనిపిస్తారు. ఇలా ఒక బహుళార్ధసాధక ప్రాజెక్ట్ లాంటి ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎంటర్ప్రెన్యూరింగ్ స్పిరిట్ పవన్ కళ్యాణ్ లో పుష్కలంగా కనిపిస్తుంది. నిజానికి ఏ ఇతర కాంటెంపరరీ స్టార్ చేయనన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేయటం ద్వారా తనదైన ఒక ప్రత్యేక ముద్రను యూత్ హృదయాలలో వేసుకోగలిగారు పవన్ కళ్యాణ్.
పవన్ మాట, పవన్ పాట, పవన్ ఆట – ఇలా పవన్ కళ్యాణ్ అన్న పేరే ఒక మాయగా, మంత్రంగా మారిపోటానికి కారణం అతను కేవలం నటుడు మాత్రమే కాకపోవటం. నిజానికి తమ అభిమాన నటుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉంటారు. అభిమాన నటుడి నటన, నడక, నడత, అలవాట్లు, అభిరుచులు – ఇలా వాళ్లకు చెందిన ప్రతి చిన్న విశేషానికి అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. అలాంటిది ఒక్క నటనకే పరిమితం కాకుండా తమ అభిమాన తార ఒక మల్టిపుల్ టాలెంటెడ్ ఐకాన్ గా ఎదగటాన్ని అభిమానులు గర్వ కారణంగా ఫీల్ అవుతారు. Proud to be the Fan of Pawan Kalyan … అని గర్వంగా చెప్పుకోవటానికి అవసరమైన సగర్వ ప్రతిభలు పవన్ కళ్యాణ్ లో చాలా ఉన్నాయి. అవి ఏమిటో అందరికీ తెలిసినప్పటికీ ఒక్కసారి వెనక్కు తిరిగి పవన్ కళ్యాణ్ లో ఉన్న సకల కళా ప్రావీణ్యం ఏమిటో చూద్దాం.
సింగర్ గా పవన్:
సింగర్ గా “తమ్ముడు” చిత్రంలో ‘తాటిచెట్టు ఎక్కలేవు’, ‘ఏ పిల్ల మాట్లాడవా’ – పాటలు,
“ఖుషీ” లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ’,
“జానీ” లో ‘నువ్వు సారా తాగుట’, ‘రావోయి మా ఇంటికి’ , ‘కిళ్ళీ కిళ్ళీ’ పాటలు,
“అత్తారింటికి దారేది” లో ‘కాటమ రాయుడా కదిరీ నరసింహుడా’ పాట,
“అజ్ఞాతవాసి” లో ‘కొడకా కోటేశ్వరరావ’ పాటలు పాడి అభిమానులను విశేషంగా అలరించారు పవన్ కళ్యాణ్.
రచయితగా పవన్:
* ఇక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా చూస్తే – ‘జానీ’ చిత్రానికి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, గుడుంబా శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించారు పవన్ కళ్యాణ్.
డాన్స్ డైరెక్టర్ :
* కొరియోగ్రాఫర్ లేదా సాంగ్ విజువలైజర్ కేటగిరిలోకి వస్తే “ఖుషి” చిత్రంలో ఏ మేరా జహా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ప్రేమంటే సులువు కాదురా, చెలియ చెలియా పాటలకు, జానీ, గుడుంబా శంకర్ చిత్రాలలోని అన్ని పాటలకు, పంజా చిత్రంలోని టైటిల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు పవన్ కళ్యాణ్.
ఫైట్ మాస్టర్ గా పవర్ స్టార్ :
స్టంట్ కోఆర్డినేటర్ లేదా స్టంట్ మాస్టర్ కేటగిరిలోకి వస్తే- తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, గుడుంబా శంకర్ చిత్రాలతో పాటూ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ” డాడీ” చిత్రానికి కూడా ఫైట్ మాస్టర్ గా డిఫరెంట్ కంపోజిషన్స్ చేసి వెల్డన్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్.
నిర్మాతగా కళ్యాణ్ :
నిర్మాతగా చూస్తే తమ ‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మితమైన కొన్ని సొంత చిత్రాల టైటిల్ కార్డ్స్ లో నిర్మాత పవన్ కళ్యాణ్ అని కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద” సర్దార్ గబ్బర్ సింగ్”, తన వీర అభిమాని , హీరో నితిన్ నటించిన “చల్ మోహనరంగా” చిత్రాల టైటిల్స్ లో కో- ప్రొడ్యూసర్ గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ టైటిల్.
ఇలా ఒక వైపు పాపులర్ అండ్ క్రేజీ స్టార్ గా కొనసాగుతూ మరొకవైపు డైరెక్టర్ గా, సింగర్ గా, ఫైట్ కంపోజర్ గా, కొరియోగ్రాఫర్ గా, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా మల్టిపుల్ టాలెంట్స్ తో తనను తాను విలక్షణంగా, విశిష్టంగా ఆవిష్కరించుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ అంటే ఉభయ రాష్ట్రాల యూత్ కు విపరీతమైన అభిమానం, ఆరాధన. అయితే వీటన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ కు అద్భుత విజయాలు సిద్ధించాయి అని చెప్పబోవటం లేదు. Participation is greater than winning అన్నట్లు ఆసక్తి ఉన్న ప్రతి పని పట్ల ఆచరణాత్మక కృషితో తనను తాను నిరూపించుకున్న ప్రాక్టికల్లీ హార్డ్ వర్కర్ పవన్ కళ్యాణ్.
తన అన్నయ్య చిరంజీవి రాజకీయ రంగంలోకి వెళ్లినప్పుడు 2009 నుండి యంగ్ మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మంచి విజయాలతో ఆ వాక్యూమ్ ను ఫిల్ చేస్తున్నప్పటికీ “ఖైదీ నెంబర్ 150” తో The Boss is coming back అనుకుంటుండగానే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది అనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పి మెగా కాంపౌండ్ లో ఉత్సాహాన్ని, ఉదృతిని బలంగా కొనసాగించిన the true Power Star of the Mega Compound is Pawan Kalyan.
ఇవి పవన్ కళ్యాణ్ కు జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ ఏర్పడటానికి కారణం. So Pawan Kalyan is not just an Actor…. He is an All Rounder .
ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో వీటన్నిటికంటే అతీతమైన, ఉన్నతమైన కోణం మరొకటి ఉంది. అదే మానవతా కోణం. ఆ కోణం తాలూకు విస్తృతి, వైశాల్యాలు అత్యున్నతమైనవి కావటం వల్లనే సినిమా రంగం తాలూకు గ్లామర్ ను, క్రేజ్ ను, సంపాదనను తృణప్రాయంగా భావించి ప్రజా సంక్షేమ లక్ష్యంతో ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించారు పవన్ కళ్యాణ్. ఎత్తులకు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సాగే రాజకీయ రణరంగంలో పారదర్శక వ్యక్తిత్వమున్న పవన్ కళ్యాణ్ ఎలా నెగ్గుకొస్తారో కాలమే నిర్ణయిస్తుంది. తన రాజకీయ రంగ ప్రస్థాన ఫలితం ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సినీ రంగ నిష్క్రమణను మాత్రం ఒక బాధాకర పరిణామంగా భావిస్తోంది కోట్లాదిగాగల మెగా అభిమాన సైన్యం.
హిట్లు ప్లాపుల లెక్కలు పక్కన పెడితే టాలీవుడ్ బాక్సాఫీస్ బరి లో పవన్ కళ్యాణ్ ఉంటే “ఆ కిక్కే వేరప్పా” అనుకుంటున్న ఫిలిం ట్రేడ్, మీడియా, ఫాన్స్ అండ్ పబ్లిక్ కు ఆ ముచ్చట తీరే రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో!? రాజకీయరంగంలో నిర్దేశిత లక్ష్యాన్ని అందుకున్న తర్వాతనైనా పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ మీద మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయవచ్చా!?
అప్పటిదాకా “ఏవి పవన్ నిరుడు మెరిసిన నీ సినీ సమ్మోహన జిలుగు వెలుగుల్” – అని వేయి కన్నుల ఎదురుచూస్తుంటాడు ఒక్కో మెగా అభిమాని.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: