టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది. `జెర్సీ`లో నేచురల్ స్టార్ నాని, `మజిలీ`లో యువ సామ్రాట్ నాగచైతన్య, `డియర్ కామ్రేడ్`లో సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందణ్ణ క్రికెటర్ పాత్రల్లో సందడి చేయనున్నారు. అంతేకాదు…ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరుతున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే… ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `మహర్షి`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోగా మహేష్ నటిస్తున్న 25వ సినిమా ఇది. ఇందులో మూడు విభిన్న ఛాయలున్న పాత్రలో మహేష్ సందడి చేయనున్నాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా, ఆధునిక రైతుగా… ఇలా ఒకే సినిమాలో త్రీ షేడ్స్ ఉన్న రోల్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు… ఓ సన్నివేశం కోసం క్రికెటర్‌గానూ కనిపించనున్నాడట మహేష్. కాలేజ్ ఎపిసోడ్స్‌లో వచ్చే ఈ సీన్‌లో జెర్సీ వేసుకుని మహేష్ చేసే సందడి అభిమానులకు కనువిందు కలిగిస్తుందని సమాచారం. మరి… క్రికెటర్ లుక్‌లో మహేష్ ఎలా ఉంటాడో తెలియాలంటే ఏప్రిల్ 25 వరకు వేచి చూడాల్సిందే.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… `మహర్షి`, `మజిలీ`, `జెర్సీ`, `డియర్ కామ్రేడ్`… ఇలా క్రికెట్ టచ్ ఉన్న ఈ తెలుగు సినిమాలన్నీ వేసవి బరిలో దిగుతుండడం విశేషం. మరి… క్రికెటర్లుగా మన స్టార్స్ ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే ఈ వేసవి పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే.
[youtube_video videoid=zcCojSpjUOg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: