ఏదైనా పండుగ వస్తుందంటే చాలు ఎంత హడావుడి ఉంటుందో.. సినిమా థియేటర్ల దగ్గర కూడా అంతే హడావుడి ఉంటుంది. పండుగ రోజు సినిమా రిలీజ్ చేయాలని ముందు నుండే డేట్ ను ఫిక్స్ చేసి పెట్టుకుంటారు దర్శకనిర్మాతలు. అందులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే నిజమైన సినీ పండుగ అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది సంక్రాంతి కానుకగా..పలువురి స్టార్ హీరోల సినిమాలు రిలీజై ప్రేక్షకులకు అసలైన పండుకను తీసుకొచ్చిపెడుతుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కూడా నాలుగు భారీ బడ్జెట్, సూపర్ స్టార్లు నటించిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకరోజు అటూ ఇటుగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా సరే… తమ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ముందుకొస్తారు. జనవరి 9 తేదీన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో ప్రారంభమయ్యే సినీ సంక్రాంతి వేడుక జనవరి 12 వరకు కొనసాగనుంది. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు, 10న పేటా, 11న వినయవిధేయ రామ, 12న ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
నాలుగు సినిమాలు పెద్ద సినిమాలే..స్టార్ హీరోలే… అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే కావడంతో పోటీకి తగ్గట్టే అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు బ్రహ్మరథం పడతారో అని ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరోవైపు మంచి పోటా పోటీ ఉండటంతో కలెక్షన్ల విషయంలో కాస్త భయంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడం. దీంతో తక్కువ థియేటర్లు ఉన్న నేపథ్యంలో భారీ కలెక్షన్లు రాబడుతాయో లేదో విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం. మరి ఈలోపు ఈ నాలుగు సినిమాలో పొంగల్ విన్నర్ ఎవరవుతారనకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.
[custom_ad]
[totalpoll id=”13685″]
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: