విజయ్ కిరగందూర్ నిర్మాణ సారధ్యం లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన K.G.F చాప్టర్ 1 కన్నడ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 21 తేదీ రిలీజయి విజయ ఢంకా మ్రోగిస్తుంది. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రంలో రిలీజయిన సినిమాలలో బాహుబలి 2 మూవీ 100క్రోర్స్ మార్క్ దాటగా, K.G.F చాప్టర్ 1 కన్నడ మూవీ100క్రోర్స్ మార్క్ దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2వారాలలో 175 క్రోర్స్ కలెక్ట్ చేసింది. మూడవ వారంలో కూడా బెంగుళూర్ లో రోజూ 350 షోస్ తో ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడం తో K.G.F చాప్టర్ 1మూవీ కి సీక్వెల్
K.G.F చాప్టర్ 2 మూవీ షూటింగ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలలో ఉంది. K.G.F చాప్టర్ 2 మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళి డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[youtube_video videoid=f-BFAXYxT2A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: