సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం `బాషా` (1995). అంతకుముందు రజనీ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై అలరించినప్పటికీ… `బాషా`తోనే తెలుగునాట రజనీమేనియా మొదలైంది. `బాషా` తరువాత రజనీ హీరోగా వచ్చిన పలు చిత్రాలు తెలుగులోనూ రికార్డు స్థాయి విజయాలు అందుకున్నాయి. అలాంటి `బాషా` విడుదలైన సంక్రాంతి సీజన్‌లోనే… 24 ఏళ్ళ తరువాత వస్తున్న మరో సంక్రాంతి చిత్రం `పేట`. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న తెరపైకి రానుంది. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అవడమే కాదు… మరో విషయంలోనూ ఈ రెండు చిత్రాలకి పోలిక ఉందని కోలీవుడ్ టాక్. అదేమిటంటే… `బాషా`లో ఫస్ట్ హాఫ్‌లో ఆటోడ్రైవర్‌గా కనిపించి… సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్‌ఫుల్ రోల్‌లో రజనీ కనిపిస్తే… `పేట`లో కూడా అలాంటి వ్యవహారమే ఉంటుందట. ఇందులో ఫస్ట్ హాప్‌లో హాస్టల్ వార్డెన్‌గా కనిపించి… సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో పవర్‌ఫుల్ రోల్‌తో చెలరేగిపోతారట రజనీ. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=PDFt7cpKaxc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: