లేడీ సూపర్ స్టార్ గా నయనతార వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒకపక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోపక్క లేడి ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం నయన్ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన సెకండ్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఐరా టీజర్ ను చూస్తుంటే ఎవరైనా ఔరా అనాల్సిందే అన్నట్టు ఉంది. మరో హిట్ నయన్ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తమిళనాట ‘లక్ష్మీ’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సుదర్శన్, సుందరామ్మూర్తి, రవీంద్రన్, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ భామ …చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతోన్న ‘సైరా…నరసింహారెడ్డి’ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు అజిత్ హీరోగా నటిస్తోన్న ‘విశ్వాసం’ మూవీలో కూడా ఒక కథానాయికగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. వీటితో పాటు విజయ్ హీరోగా రూపొందనున్న సినిమాలో, శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె కథానాయిక ఎంపికైనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా నయనతారకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
[youtube_video videoid=R0w4kdwTNHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: