`రంగస్థలం` వంటి ఘనవిజయం తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం `వినయ విధేయ రామ`. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. `భరత్ అనే నేను` ఫేమ్ కియరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే… ఫ్యామిలీ, ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ఇంటర్వెల్ తరువాత అరగంట సేపు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని ఇన్‌సైడ్ సోర్స్ టాక్. బీహార్ నేపథ్యంలో వచ్చే ఈ ఎపిసోడ్ తాలూకు సన్నివేశాలను అజర్ బైజాన్ లో చిత్రీకరించారని… ఆ అరగంట సేపు అభిమానులు `గూస్ బంప్స్` ఫీలయ్యే స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ లు వుంటాయని సమాచారం. అంతేకాదు… ట్రైలర్ లో రాంబో తరహాలో కనిపించే రామ్ చరణ్ గెటప్ కు సంబంధించిన సీన్లు కూడా ఇందులోనే ఉంటాయట. మొత్తమ్మీద… `రంగస్థలం` తరువాత రామ్ చరణ్ నుంచి ఎలాంటి సినిమాని మెగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో… అవన్నీ `వినయ విధేయ రామ`లో ఉండనున్నాయన్నమాట. మరి… ఈ మాస్ మసాలా మూవీ… బాక్సాఫీస్ వద్ద మరో మాసివ్ హిట్ అవుతుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=8WgF-3Ra5jc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: