డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్… ప్రస్తుతం `ఇస్మార్ట్ శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఆ తరువాత నిరవధికంగా చిత్రీకరణ జరిపి… వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మెలోడీ బ్రహ్మ మణిశర్మని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాదు… ఇండస్ట్రీ హిట్ అయిన `పోకిరి`కి మణిశర్మ బాణీలు అందించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `చిరుత`, `ఏక్ నిరంజన్`, `కెమెరామేన్ గంగతో రాంబాబు`, `టెంపర్` (నేపథ్య సంగీతం) వచ్చాయి. పాటల పరంగానే కాదు… నేపథ్య సంగీతం పరంగానూ ఈ సినిమాలు నిరాశపరచలేదు కాబట్టి… ఈ కాంబోలో మరో మ్యూజికల్ హిట్‌గా `ఇస్మార్ట్ శంకర్`నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. `టెంపర్` తరువాత సరైన విజయం లేని పూరికి మణి మరోసారి కలిసొస్తాడేమో చూడాలి. త్వరలోనే మణిశర్మ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుంది. కాగా… ఈ చిత్రంలో రామ్ సరసన ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నారు. వారి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: