విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ `F2`. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించగా…. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే… ఫ్యామిలీ డ్రామాగా… ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమాలో కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యానికే పెద్ద పీట వేసినప్పటికీ… ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌కు కూడా స్కోప్ ఉంటుందట. ముఖ్యంగా… సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయట. ఈ ఫన్, ఎమోషన్స్ తాలూకు సన్నివేశాల్లో వెంకీ ఎప్పట్లాగే తన సహజ నటనతో సినిమాని నెక్ట్స్ లెవల్ తీసుకువెళితే… వరుణ్ తేజ్ కూడా ఇప్పటివరకు చేయని డిఫరెంట్ రోల్‌లో కామెడీతో పాటు ఎమోషనల్ సీక్వెన్స్‌లోనూ `కెరీర్ బెస్ట్` పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడని సమాచారం. మరి… ఈ తోడల్లుళ్ళ వినోదాన్ని, భావోద్వేగాలను చూడాలంటే… మరో వారం రోజులు వేచిచూడక తప్పదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=GiKB2ZJlOlE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: