
ట్యాగ్ · 12 కథనాలు


రిలీజ్ డేట్ ను మార్చుకున్న 'కోబ్రా'

"కోబ్రా"మూవీ ఆడియో వేడుకలో విక్రమ్

తండ్రి హెల్త్ రూమర్స్ పై తనయుడి క్లారిటీ..!

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

"విక్రమ్" మూవీ ట్రైలర్ రిలీజ్

కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ లో విక్రమ్?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమాతో చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది.

రిలీజ్ డేట్ ను మార్చుకున్న 'కోబ్రా'
ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా కోబ్రా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమాను ముందు నుండి ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ వచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

భారీ సాంగ్ తో "పొన్నియిన్ సెల్వన్ 1"
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

'పొన్నియన్ సెల్వన్' 5 భాషల్లో విక్రమ్ డబ్బింగ్..!
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాపై టీజర్ తో అంచనాలను మరింత పెంచారు.

"కోబ్రా"మూవీ ఆడియో వేడుకలో విక్రమ్
గత కొన్ని రోజులు క్రితమే కోలీవుడ్ ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ తనకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరో విక్రమ్ హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. తరువాత విక్రమ్ కోలుకున్నాక అందరి కోసం తన ఆరోగ్యం బాగానే ఉందని ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తండ్రి హెల్త్ రూమర్స్ పై తనయుడి క్లారిటీ..!
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నిన్న కాస్త ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. దీంతో విక్రమ్ ను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ బాగానే ఉన్నారు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే సన్నిహితులు తెలియచేశారు. అయితే విక్రమ్ ఆరోగ్య పరిస్థితులపై కొన్ని తప్పుడు కథనాలు కూడా వచ్చాయి. విక్రమ్ గుండెపోటుకు గురయ్యారని.. అందుకే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలపై స్పందించిన విక్రమ్ తనయుడు ధృవ్ క్లారిటీ ఇచ్చాడు.

'కోబ్రా' తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ఎన్వీఆర్ సినిమా
ప్రయోగాత్మక చిత్రాలతో అనేక సూపర్‌హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్, అసాధారణ సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!
మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

"విక్రమ్" మూవీ ట్రైలర్ రిలీజ్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణం వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం.

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్
విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్