
ట్యాగ్ · 12 కథనాలు


విజయ్ సేతుపతి తో రాశీఖన్నా సెల్ఫీ

మరో తెలుగు మూవీలో విజయ్ సేతుపతి

కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్
విజయ్ సేతుపతి పెన్సిల్ స్కెచ్
అఫీషియల్.. ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతికి జోడీ గా అనుష్క ?
మరో మెగా హీరోకు విలన్ గా..?
ఆ పాత్ర ఇవ్వమని వేడుకున్నాను..!
బాలీవుడ్ మూవీ లో విజయ్ సేతుపతి
శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!

విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్ రిలీజ్
విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే పాత్రలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి కాబట్టే విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగుతో పాటు పలు భాషల్లో పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో తగ్లక్ దర్బార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈసినిమా నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది.

విజయ్ సేతుపతి తో రాశీఖన్నా సెల్ఫీ
తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా తెలుగు , తమిళ భాషల మూవీస్ , వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ & డీకేలు, షాహిద్ కపూర్ హీరోగా ఒక హిందీ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. అందాల రాశీఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మరో తెలుగు మూవీలో విజయ్ సేతుపతి
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ సేతుపతి కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం 13 తమిళ , ఒక మలయాళ , ఒక హిందీ మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్"సైరా నరసింహారెడ్డి "మూవీ లో తమిళ వారియర్ రాజ పాండి గా చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. ఇప్పటికే కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది.
విజయ్ సేతుపతి పెన్సిల్ స్కెచ్
హీరో , విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. "సుందర పాండియన్ " మూవీ కి బెస్ట్ విలన్ గా తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్న విజయ్ "విక్రమ్ వేద ", "96 " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "సైరా నరసింహా రెడ్డి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ "ఉప్పెన "మూవీ లో ఒక కీలక పాత్ర తో ప్రేక్షకులను అలరించనున్నారు.
అఫీషియల్.. ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి
ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు... సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

విజయ్ సేతుపతికి జోడీ గా అనుష్క ?
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్దం " విడుదలకు సిద్ధంగా ఉంది.US లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళం , హిందీ , ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ట్రైలర్ లు ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
విజయ్ పై కమల్ ప్రశంసలు - కమర్షియల్ మాయలో పడలేదు నువ్వు..!
తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి. మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ.. తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే తక్కువ కాలంలోనే మంచి నటుడిగా, స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు. పక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కీలకమైన పాత్రల కోసం విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
మరో మెగా హీరోకు విలన్ గా..?
ఒక పక్క హీరోగా.. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే సైరా లో చేసిన విజయ సేతుపతి.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ గా నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో పాటు త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఆ పాత్ర ఇవ్వమని వేడుకున్నాను..!
కాగా కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. తెలుగు, తమిళ సినిమాలతో వరుస సినిమాలతో బిజీగా బిజీగా దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే విజయసేతుపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.
బాలీవుడ్ మూవీ లో విజయ్ సేతుపతి
కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96 తమిళ మూవీ ఘనవిజయం సాధించి పలు భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి నాలుగు మూవీస్ లో ప్రతినాయకుడి పాత్రలను ఓకే చేశారు. విజయ్ హీరోగా రూపొందనున్న విజయ్ 64 మూవీ, కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ, తెలుగు లో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.
శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!
శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం శంకర్ సినిమాకు నో చెప్పాడంట. అతను ఎవరో కాదు తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి.