మరో మెగా హీరోకు విలన్ గా..?

Vijay Sethupathi As Villain For Another Mega Hero

ఒక పక్క హీరోగా.. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే సైరా లో చేసిన విజయ సేతుపతి.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ గా నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో పాటు త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇప్పుడు తాజాగా మరో మెగా హీరో కు కూడా విలన్ గా నటించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆ మెగా హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =