
ట్యాగ్ · 18 కథనాలు


విజయ్ దేవరకొండ "#VD 11"మూవీ ప్రారంభం

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ?

కాంబినేషన్ రిపీట్...?

నగర శివార్లలో విజయ్ దేవరకొండ సందడి
రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?

పూరీ - విజయ్ ల 'ఫైటర్ '

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు

ఎప్పుడైనా సినిమాలకు ఆపొచ్చు..!

లిప్ లాక్ సీన్స్ పై స్పందన

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన
బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

మీరే నా రియల్ కామ్రేడ్

విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!

100 మందికి సంతోషాన్ని మిగిల్చిన విజయ్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఈ ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఆసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా చేయనున్నాడు.

విజయ్ దేవరకొండ "#VD 11"మూవీ ప్రారంభం
పాన్ ఇండియా "లైగర్ " మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "#VD 11"మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒక డాన్‌కి, అతని కొడుకుకి మధ్య సాగే కథే ఈ చిత్రమని తెలిసింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... ఓ సీనియర్ హీరో డాన్‌గా కనిపించనుండగా... అతని కొడుకుగా విజయ్ నటించనున్నాడని సమాచారం. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్... ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. అలాగే... 2020 సమ్మర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు…

కాంబినేషన్ రిపీట్...?
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రమణ్యం సినిమా తో టాలీవుడ్ లో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ను పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నగర శివార్లలో విజయ్ దేవరకొండ సందడి
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బ్రేకప్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.
రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... క్రాంతి మాధవ్ డైరెక్టోరియల్‌లోనూ... అలాగే మల్టీలింగ్వల్ మూవీ ‘హీరో’లోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు విజయ్. వీటితో పాటు... ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ నటించనున్నాడు ఈ యూత్ ఐకాన్. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్.
డిసెంబర్‌లో రానున్న విజయ్ దేవరకొండ కొత్త చిత్రం?
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే... మరో సినిమాను లైన్‌లో పెడుతూ... వరుస చిత్రాలతో బిజీగా మారుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... ఈ టాలెంటెడ్ హీరో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు... ‘బ్రేకప్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇందులో విజయ్ ప్లే బాయ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు సమాచారం. కాగా... ఈ చిత్రాన్ని…

పూరీ - విజయ్ ల 'ఫైటర్ '
రామ్ తో మంచి మాస్ మసాలా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు పూరీ. కేవలం పూరీ కే కాదు.. రామ్ కి కూడా మంచి హిట్ ఇచ్చాడు. దీనితో మళ్ళీ పూరీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు పూరీతో సినిమా చేయడానికి మళ్లీ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పూరీ ఏకంగా టాలీవుడ్ క్రేజీ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. విజయ్ కోసం ఎంతోమంది లైన్ లో ఉండగా.. విజయ్ మాత్రం ఆ ఛాన్స్ ను డాషింగ్ డైరెక్టర్ కి ఇవ్వడం విశేషమే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వీరు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్
ఒక హీరో లో ఉన్న హీరోయిజాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలంటే అది డాషింగ్ డైరెక్టర్ పూరీ వల్లే సాధ్యమవుతుందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే టక్కున విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. సినిమా లవర్స్ కి పండగే కదా..

డిఫరెంట్ సబ్జెక్ట్‌తో పూరి, విజయ్ దేవరకొండ మూవీ?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతిమాధవ్ డైరెక్టోరియల్, ‘హీరో’ చిత్రాలతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడు. అంతేకాదు... `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడట విజయ్.
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు
విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తరువాత వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక విజయ్ కు కేవలం యూత్ లోనే కాదు యంగ్ హీరోయిన్ల లో కూడా విజయ్ పై క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పిందంటే విజయ్ క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆమే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో…

ఎప్పుడైనా సినిమాలకు ఆపొచ్చు..!
విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు చిత్రయూనిట్. ఇక విజయ్ సినిమా కాబట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రేపటితో సినిమా భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.

లిప్ లాక్ సీన్స్ పై స్పందన
నువ్విలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు మూవీ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ గా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ మూవీస్ తో విజయ్ టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ సీన్స్ గురించి కొంతమంది చర్చించుకొంటున్నారు.

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్
సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ తాను నటించిన మూవీస్ ను తన సొంత స్టైల్ లో ప్రమోట్ చేస్తూ, మార్కెట్ వేల్యూ పెంచుతున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ తో విజయ్ దేవరకొండ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మ్యూజిక్ ఫెస్టివల్ పేరు తో చిత్ర యూనిట్ తో నాలుగు నగరాలలో ఈవెంట్స్ ను నిర్వహించి కొత్తపద్ధతి లో డియర్ కామ్రేడ్ మూవీ ని ప్రమోట్ చేశారు.

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హీరో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ ని షాహిద్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగ హిందీ భాషలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించగా కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది. 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో షాహిద్ కపూర్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన రెండవ మూవీ డియర్ కామ్రేడ్ . శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా…

మీరే నా రియల్ కామ్రేడ్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈనెల 26 తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజవ్వగా.. నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా తీయాలని ఉంది అన్న రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవన్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్.