ఒక హీరో లో ఉన్న హీరోయిజాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలంటే అది డాషింగ్ డైరెక్టర్ పూరీ వల్లే సాధ్యమవుతుందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే టక్కున విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. సినిమా లవర్స్ కి పండగే కదా..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆ కోరిక తీరబోతుంది. గత కొద్ధి కాలంగా పూరీ, విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవి వార్తలు కాదు నిజమే అని కన్ఫామ్ అయింది. ఈ విషయాన్ని ఛార్మి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూరీ తర్వాత సినిమా విజయ్ దేవరకొండ తో అని, లావణ్య సమర్పణలో పూరీ కనెక్ట్స్ అండ్ పూరీ జగన్నాద్ టూరింగ్ టాకీస్ పతాకాలపై పూరీ మరియు తను నిర్మిస్తున్నట్టు తెలిపింది. మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామనట్లు ఛార్మి ట్వీట్ చేసింది.
It’s official 💃🏻💃🏻
Today is really happpyyyyy happyyyyy #Eid 🤗🤗🤗@TheDeverakonda @purijagan @PuriConnects #PCfilm #EidMubarak pic.twitter.com/NfX34DBnrl— Charmme Kaur (@Charmmeofficial) August 12, 2019
మరి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో పూరీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా పూరీ కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో వుంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటినుండి అటు పూరీ ఫ్యాన్స్, అటు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు. మరి చూద్దాం సినిమా ఎప్పుడు పట్టాలెక్కుంతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో..
[youtube_video videoid=NtIgSHeUU6Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: