నంద‌మూరి కళ్యాణ్ రామ్ న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌ద‌హారేళ్ళు

16 Years For Nandamuri Kalyan Ram In Tollywood,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Best Movies of Kalyan Ram, Kalyan Ram 16 Glorious years of tollywood, Kalyan Ram Completes 16 Years in Tollywood, Kalyan Ram Latest News

వైవిధ్యభరితమైన క‌థాంశాల‌కు పెద్ద‌పీట వేసే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అలాంటి క‌ళ్యాణ్ రామ్‌ న‌ట‌నాప్ర‌స్థానానికి బీజం వేసిన చిత్రం ‘తొలిచూపులోనే…’. తన తాత, మహానటుడు యన్.టి.రామారావు నటించిన ‘జస్టిస్ చౌదరి’ చిత్రంలోని “నీ తొలిచూపులోనే” అనే పాటలోని తొలి ప‌దాన్ని టైటిల్‌గా ఎంచుకుని… కథానాయకుడిగా తొలి అడుగులు వేసాడు ఈ నంద‌మూరి హ్యాండ్స‌మ్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆకాంక్ష నటించగా… సుమన్, శారద, చరణ్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరామ్, వేణుమాధవ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. చ‌క్రి స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ అప్ప‌టి యువ‌త‌రాన్ని విశేషంగా అల‌రించాయి. ఉషాకిరణ్ మూవీస్ ప‌తాకంపై అగ్ర నిర్మాత రామోజీరావు నిర్మించిన 75వ చిత్రమిది. 2003 అక్టోబర్ 9న విడుద‌లైన ‘తొలిచూపులోనే…’తో క‌థానాయ‌కుడిగా కెరీర్‌ను ప్రారంభించిన కళ్యాణ్ రామ్‌… నేటితో 16 ఏళ్ళ చిత్ర‌ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. మున్ముందు… కళ్యాణ్ రామ్‌ మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషిస్తూ…న‌టుడిగా ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 15 =