మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయి కుమార్ ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్టు కొట్టాడు. అయితే ఆ తరువాత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సరైన హిట్టు కోసం ఎప్పటినుండో వెయిట్ చూస్తున్నాడు ఆది. యువ కథానాయకులతో పోటీ పడటానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఇదిలా ఉండగా ఆది ప్రస్తుతం బుర్రకథ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక గతకొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మోస్టర్ పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆది రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు రెండు షెడ్స్ కు సంబంధించిన హ్యబిట్స్ ని మోషన్ పోస్టర్లో చూపించారు.
కాగా ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇంకా ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, గాయత్రీ గుప్తా తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=upDVoWkXQRM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: